చాలామందికి ఉదయాన్నే టీ తాగడం ఒక అలవాటుగా మారింది. కానీ సాధారణ పాల టీ తరచుగా తాగితే ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడదు. అయితే లెమన్‌గ్రాస్ టీ (Lemongrass tea) ఆరోగ్యానికి ఎంతో మంచిది. లెమన్‌గ్రాస్ లో ఉన్న ఔషధ గుణాల వల్ల శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
లెమన్‌గ్రాస్ టీ కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను ఇది సహజ రీతిలో నియంత్రిస్తుంది. కడుపును శుభ్రపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గింపు: హై కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి ఇది మంచి ఆప్షన్. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వెయిట్ లాస్: లెమన్‌గ్రాస్ టీ మెటబాలిజంను పెంచి, కొవ్వు కరుగుదలకు సహాయపడుతుంది. దీంతో బరువు నియంత్రణ సులభం అవుతుంది.
రక్తపోటు నియంత్రణ: రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్తప్రసరణను మెరుగుపరచే లక్షణాలు దీనిలో ఉన్నాయి. దీంతో హై బీపీ (High BP) ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది.
ఇమ్యూనిటీ: ఈ టీలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు (Anti Oxidants) , యాంటీ బ్యాక్టీరియల్ (Anti Bacterial) లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని (Immunity) బలోపేతం చేస్తాయి. నోటి ఇన్ఫెక్షన్లు (Mouth Infections) , బ్యాక్టీరియా వృద్ధి వంటి సమస్యలను తగ్గిస్తాయి.
స్ట్రెస్ రిలీఫ్: లెమన్‌గ్రాస్ టీ సువాసన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది మంచి నిద్రకు తోడు అవుతుంది. అంతేకాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని లోపల నుంచి మెరుగుపరుస్తుంది.
తయారీ: ఒక కప్పు నీటిలో 1–2 టీస్పూన్ల లెమన్ గ్రాస్ వేసి 5–7 నిమిషాలు మరిగించి వడకట్టి తాగాలి. కావాలంటే అల్లం లేదా తేనె జోడించవచ్చు.