ప్రెగ్నెన్సీ (Pregnancy) సమయంలో తల్లులు తీసుకునే ఆహారం బిడ్డ ఎదుగుదలను నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవడం తప్పనిసరి. డాక్టర్ సూచించిన డైట్‌తో పాటు, రోజువారీ ఆహారంలో సహజమైన పదార్థాలు చేర్చుకుంటే బిడ్డ ఎముకలు బలంగా పెరుగుతాయి. మరి ఆ ఫుడ్స్ ఏమిటో తెలుసుకుందాం..
Founder, Sky High Videos
రాగులు: రాగులు (Finger Millets) ప్రెగ్నెన్సీలో అత్యంత ఉపయోగకరమైనవి. వీటిలో కాల్షియం (Calcium) , ఐరన్ (Iron) , ఫైబర్ (Fiber) పుష్కలంగా ఉంటాయి. ఇవి బిడ్డ ఎముకల ఎదుగుదలకు చాలా మంచివి. రక్తహీనత, జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో రాగులను తీసుకుంటే మరింత మంచిది.
నట్స్: వాల్‌నట్స్ (Walnuts) , ఆల్మండ్స్ (Almonds) , జీడిపప్పు, పల్లీలు వంటి నట్స్‌లో ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega 3 Fatty acids) ఉంటాయి. ఇవి బిడ్డ మేధస్సు అభివృద్ధికి సహాయపడతాయి. ఫొలేట్, జింక్, ఫైబర్ వంటి పోషకాలు ప్రెగ్నెన్సీకి అనుకూలంగా పనిచేస్తాయి. నట్స్‌ను తక్కువ మోతాదులో, ఉప్పు లేకుండా తీసుకోవాలి.
పెరుగు: పాశ్చురైజ్డ్ పాలతో తయారైన పెరుగు (Curd) తల్లి–బిడ్డ ఇద్దరికీ మంచిది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ (Probiotics) ఉండటం వల్ల బిడ్డ ఎముకలకు మేలు చేస్తుంది. పంచదార లేని పెరుగు తీసుకోవడం ఉత్తమం.
My choice for best camera:
అంజీర్: అంజీర్‌లో (Fig) ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం తగ్గిస్తుంది. ఐరన్ కారణంగా రక్తహీనత రిస్క్ తగ్గుతుంది. ఇందులోని కాల్షియం, మెగ్నీషియం బిడ్డ ఎముకలకు తోడ్పడతాయి. రోజుకు రెండు–నాలుగు నానబెట్టిన అంజీర్ తీసుకోవచ్చు.
మూంగ్ దాల్: పెసర పప్పు ఫోలేట్, ప్రోటీన్, ఫైబర్, ఐరన్ లతో నిండిపోయి ఉంటాయి. ఇవి సూప్, స్ప్రౌట్స్, సలాడ్‌ల రూపంలో తినొచ్చు. జీర్ణం సులభంగా అవ్వడం, రక్తహీనత తగ్గడం వంటి లాభాలు కలుగుతాయి.
పాలకూర: పాలకూరలో కాల్షియం, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి బిడ్డ మెదడు, ఎముకల ఎదుగుదలకు సహాయపడతాయి. ఆకుకూరలను శుభ్రంగా కడిగి వాడాలి.