ఈ రోజుల్లో స్ట్రెస్ (Stress) , అసమతుల ఆహారం, కెమికల్ ప్రోడక్ట్స్ (Chemical Products) వాడటం వల్ల చిన్న వయసులోనే తెల్లజుట్టు (White Hair) కనిపిస్తోంది. దీనితో చాలా మంది ఇబ్బందిపడుతూ, వెంటనే జుట్టుకు డైలు లేదా కలర్స్ వేస్తుంటారు. అయితే ఇలా కెమికల్స్ తో నిండిన డైస్ వాడడం కంటే కూడా ఇంటి వద్దనే సహజంగా చెట్టును నిలబరుచుకోవచ్చు.
కెమికల్ డై సైడ్ ఎఫెక్ట్స్: మార్కెట్లో దొరికే హెయిర్ డైల్లో కఠిన రసాయనాలు ఉంటాయి. ఇవి అలర్జీ, దురద, రాషెస్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలను పెంచే ప్రమాదం ఉంది. అందుకే నేచురల్ రిమెడీస్ ఎక్కువగా ఉపయోగపడతాయి.
సేజ్ .. రోజ్‌మేరీ హెర్బల్ వాష్: ఇంట్లోనే అందుబాటులో ఉండే సేజ్ (Sage) , రోజ్‌మేరీ(Rosemary ) ఆకులతో సహజమైన హెయిర్ టానిక్ తయారు చేయొచ్చు. ఈ ఆకులను వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టి వడకట్టాలి. స్నానం సమయంలో ఈ నీటితో జుట్టు శుభ్రం చేస్తే క్రమంగా న్యాచురల్ బ్లాక్ టోన్ వస్తుంది.
బ్లాక్ టీ: బ్లాక్ టీ (Black Tea) జుట్టుకు సహజమైన కలర్ ఇస్తుంది. 3 టీ బ్యాగ్స్‌ను మరిగిన నీటిలో నానబెట్టి చల్లారిన తర్వాత జుట్టుకు రాయాలి. అరగంట తర్వాత కడిగితే జుట్టు మృదువుగా మారి డార్క్ షేడ్ వస్తుంది.
కాఫీ హెయిర్ మాస్క్: ఆర్గానిక్ కాఫీ డీకాషన్‌ను కండీషనర్‌తో (Conditioner) కలిపి మాస్క్‌లా అప్లై చేస్తే మంచి గ్లోతో పాటు సహజమైన రంగు వస్తుంది. గంట పాటు ఉంచితే బెటర్ ఫలితం కనిపిస్తుంది.
పసుపు పాక్: పసుపును కొబ్బరినూనె లేదా ఆవాల నూనెతో కలిపి పేస్ట్ చేసి అప్లై చేస్తే జుట్టుకు స్లోగా నల్లటి ఛాయ వస్తుంది. దీనిలో కాఫీ పౌడర్, విటమిన్-E ఆయిల్, నిమ్మరసం కలిపితే ఇంకా మంచి ఫలితం చూపుతుంది.