వింటర్‌లో (Winter) గాలిలో తేమ తగ్గడంతో చర్మం పొడిబారడం, ఎర్రటి మచ్చలు రావడం, దురద వంటి సమస్యలు ఎక్కువవుతాయి. సాధారణంగా మాయిశ్చరైజర్ (Moisturizer)వాడినా కూడా ఫలితం కనిపించకపోవడం ఇబ్బందికరంగా మారుతుంది.

మాయిశ్చరైజర్‌ను ఎప్పుడు వాడాలి? డెర్మటాలజిస్టుల (Dermatologist) సూచన ప్రకారం స్నానం చేసిన వెంటనే, చర్మం తడిగా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ రాస్తే అది లోపలికి బాగా ఇమిడిపోతుంది. ఇలా చేస్తే స్కిన్ రోజంతా హైడ్రేట్‌గా ఉంటుంది.

ఇంట్లో తేమను నియంత్రించండి: చల్లని వాతావరణంలో కూడా ఇంట్లో హ్యూమిడిటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో హ్యూమిడిఫైర్ (humidifier) వాడితే తేమ నియంత్రణలో ఉంటుంది, స్కిన్ పొడిబారడాన్ని తగ్గించవచ్చు.

వేడి నీటితో స్నానం: వింటర్‌లో హాట్ వాటర్ బాత్ (Hot Water bath) అందరికీ ఇష్టం. కానీ అధిక వేడి నీరు చర్మంలోని సహజ ఆయిల్స్‌ను తగ్గిస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.

ఫ్రాగ్రెన్స్ ప్రోడక్ట్స్‌: సువాసన ఉన్న స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. వింటర్‌లో ఇవి చర్మాన్ని ఇంకా ఇరిటేట్ చేస్తాయి. కాబట్టి ఫ్రాగ్రెన్స్ ఫ్రీ (fragrance-free) మైల్డ్ ప్రోడక్ట్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

రోజువారీ జాగ్రత్తలు మరవొద్దు: ఈ కాలంలో నీరు తాగడం తగ్గించే అలవాటు చాలామందిలో ఉంటుంది. అయితే శరీరంలో సరైన నీరు ఉంటే చర్మం కూడా తేమగా ఉంటుంది. అదనంగా లూజ్‌గా ఉండే, గాలి చేరే బట్టలు ధరించడం, సన్‌స్క్రీన్ వాడటం అవసరం. అన్ని సూచనలు పాటించినా సమస్య కొనసాగితే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.