ఇప్పటికీ చాలా మంది మహిళలు నెలసరి (Periods) సమయంలో పొత్తికడుపు నొప్పి (cramps) , నడుం నొప్పి, అలసట వంటి సమస్యలతో బాధపడుతుంటారు. మందులు తీసుకోకుండా సహజంగా ఈ ఇబ్బందులను తగ్గించుకోవడానికి రాగులు (Finger Millets) ఎంతో మంచివని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. రాగుల్లో ఉన్న ఖనిజాలు, ఫైబర్ (Fiber), యాంటీఆక్సిడెంట్లు (Anti Oxidants) శరీరానికి ఉపశమనం ఇస్తాయి.

కాల్షియం: రాగులు (Finger Millet) కాల్షియం సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇది గర్భాశయ కండరాలను సడలించి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. నరాల పనితీరును సమతుల్యం చేయడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తాయి.

White Frame Corner

అలసట: పీరియడ్స్‌లో రక్తస్రావం ఎక్కువైతే ఐరన్ లోపం (Iron deficiency) రావడం సాధారణం. రాగులు సహజంగా ఐరన్ ఎక్కువగా కలిగి ఉండటం వల్ల అలసట, బలహీనత, తిమ్మిరి వంటి సమస్యలు తగ్గుతాయి.

White Frame Corner
White Frame Corner

హార్మోన్ సమతుల్యత: రాగుల్లో అధికంగా ఉండే ఫైబర్ హార్మోన్ల ఒడిదుడుకులను (Harmon stress) నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇది ఈస్ట్రోజెన్ (Estrogen) , ప్రొజెస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తూ పిఎంఎస్ సమస్యలను తగ్గిస్తుంది.

నొప్పి నివారణ: రాగులలో మెగ్నీషియం (Magnesium) ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని సంకోచాలను తగ్గిస్తుంది. ఇది సహజమైన కండరాల రిలాక్సర్‌లా పనిచేసి నెలసరి నొప్పిని తగ్గిస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు: రాగుల్లో ఉన్న పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు వంటివి శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను అదుపులో ఉంచి నొప్పిని తగ్గించడంలో తోడ్పడతాయి.

0218

Gray Frame Corner

పీరియడ్స్‌కు ముందు కొన్ని రోజుల పాటు, అలాగే నెలసరి సమయంలో రాగులను ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. రాగుల దోసె, జావ, రాగి మాల్ట్ వంటి వంటకాల రూపంలో సులభంగా తీసుకోవచ్చు.ఈ చిన్న మార్పు నెలసరి నొప్పి నుంచి సహజ ఉపశమనం ఇస్తుంది.