Yellow Star
Yellow Star

ఇప్పటి వేగవంతమైన లైఫ్‌స్టైల్‌లో చాలా మంది మహిళలు ఉద్యోగం,  ఇంటి పనుల్లో నిమగ్నం అవుతూ తమ ఆరోగ్యాన్ని పట్టించుకోలేకపోతున్నారు. హార్మోన్ల అసమతుల్యత, అలసట, ఎముకల బలహీనత వంటి సమస్యలు దీనివల్లే వస్తున్నాయని హెల్త్ నిపుణులు (Health Experts) చెబుతున్నారు.

Yellow Star
Yellow Star

పవర్ సోర్స్: రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు (Pumpkin Seeds) తీసుకోవడం మహిళలకు అద్భుతమైన ఆరోగ్య మద్దతు ఇస్తుంది. ఇవి శరీరానికి అవసరమైన మెగ్నీషియం (Magnesium) , జింక్‌ (Zinc) , ఐరన్‌ (Iron) వంటి ఖనిజాలు సమృద్ధిగా అందిస్తాయి. ఇవి శరీర పనితీరును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

Yellow Star
Yellow Star

హార్మోన్‌ల సమతుల్యం: మహిళల్లో తరచుగా కనిపించే  హార్మోన్ సమస్యలు (Hormone problems) నెలసరి లోపాలు, మెనోపాజ్ (Menopause) ఇబ్బందులకు దారి తీస్తాయి. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోఈస్ట్రోజెన్లు హార్మోన్ల‌ను సున్నితంగా స్థిరపరుస్తాయి. అలాగే జింక్‌ శరీరంలో ఈస్ట్రోజెన్‌ (Estrogen) , ప్రొజెస్టెరాన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది.

ఎముకల బలానికి: మెనోపాజ్ తర్వాత ఎముకల సాంద్రత తగ్గడం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎముకలకు బలం చేకూరుస్తాయి. పరిశోధనలు కూడా వీటిని ఎముకల ఆరోగ్యానికి ఉత్తమంగా సూచిస్తున్నాయి.

Yellow Star
Yellow Star

గుండె ఆరోగ్యం: గుమ్మడి గింజల్లో ఉన్న మంచి కొవ్వులు (Healthy Fats) గుండెకు మేలు చేస్తాయి. ఫైబర్‌(Fiber ) ,మెగ్నీషియం కలిసి రక్తపోటును నియంత్రిస్తాయి. ఇవి చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచటానికి సహాయపడుతూ డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Yellow Star
Yellow Star

మెరుగైన ఆరోగ్యం: గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్‌ అనే పదార్థం ఉంటుంది. సెరోటోనిన్‌ తయారీలో ఇది ఉపయోగపడుతూ మనసుకు శాంతినిస్తూ మంచి నిద్ర అందిస్తుంది. జింక్‌, మెగ్నీషియం నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి