జుట్టుకు నూనె రాయాలా వద్దా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కొంతమంది నూనె రాస్తే జుట్టు ఆరోగ్యంగా మారుతుందని విశ్వసిస్తే, మరి కొంత మంది నూనె రాయకపోతే సమస్యలు తగ్గుతాయని భావిస్తారు. అయితే నిపుణుల మాటల్లో, నూనె జుట్టు మరియు తలకు ఒక సహజ రక్షణలా పని చేస్తుంది.

నెలరోజులు నూనె రాయకపోతే? ఒక వారం రోజుల నుంచే జుట్టు సహజ తేమ తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. నూనె లేకపోవడంతో జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. మెరుపు తగ్గిపోవడంతో పాటు జుట్టు సులభంగా చిక్కులు పడుతుంది.

స్కాల్ప్ పై ప్రభావం: స్కాల్ప్ (Scalp) ఆరోగ్యంగా ఉండటానికి నూనె చాలా అవసరం. నూనె రాయకపోతే తలపై ఉండే తేమ తగ్గి చర్మం కఠినంగా మారుతుంది. దీని ఫలితంగా దురద, చుండ్రు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. జుట్టు కూడా కుదలనుంచి బలహీన పడుతుంది.

పోషక లోపం: హెయిర్ ఆయిల్స్‌లో ఉండే అవసరమైన విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును లోపల నుంచి బలపరుస్తాయి. ఒక నెల పాటు నూనె రాయకపోవడం వల్ల ఈ పోషకాలు అందక జుట్టు సహజమైన మెరుపును కోల్పోయి బలహీనమై విరిగిపోవడం మొదలౌతుంది.

జుట్టు పెరుగుదల: నిపుణులైన హెయిర్ థెరపిస్టులు (Hair Experts) ప్రకారం, తేమ ,పోషకాలు తగ్గిపోతే జుట్టు పెరుగుదల నెమ్మదిస్తుంది. జుట్టు సన్నబడటం, చివర్లు చిట్లటం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే: జుట్టు సిల్కీ గా ఉండాలని కెమికల్ ప్రొడక్ట్స్ వాడే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారానికి కనీసం 2 సార్లు నూనె రాస్తే జుట్టు మృదువుగా, బలంగా, మెరిసేలా ఉంటుంది. అలాంటి సరళమైన జాగ్రత్తలతో జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.