ఈ రోజుల్లో మలబద్ధకం (Constipation) అనేది చాలామందిని వేధిస్తోంది. తగినంత నీరు తాగకపోవడం, వ్యాయామం లేకపోవడం, ఫైబర్ (Fiber) తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ప్రధాన కారణాలు. దీని వల్ల మలం గట్టిపడటం, కడుపు ఉబ్బరం, అలసట వంటి సమస్యలు వస్తాయి.
బొప్పాయి మిశ్రమం: ముందుగా పండిన బొప్పాయిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అందులో ఒక చెంచా నీటిలో నానబెట్టిన చియా సీడ్స్ (Chia Seeds) కలపాలి. తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క పొడి (Cinnamon Powder) కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి.
ఉపయోగాలు: బొప్పాయిలో ఉండే పపైన్ (Papain) అనే ఎంజైమ్ ఆహార జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. చియా విత్తనాల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కడుపులో మలాన్ని మృదువుగా చేస్తుంది.
దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు ఉంటాయి. ఇది గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీని సువాసన బొప్పాయి, చియా రుచిని మరింత పెంచుతుంది.
హైడ్రేషన్: ఈ చిట్కా ప్రభావవంతంగా పనిచేయాలంటే రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం అవసరం. తగినంత నీరు తాగడం ద్వారా పేగు కదలికలు మెరుగుపడి మలబద్ధకం సహజంగా తగ్గుతుంది.
బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరచి మలాన్ని మృదువుగా చేస్తుంది, దీంతో మలబద్ధకం సహజంగా తగ్గుతుంది. క్రమం తప్పకుండా బొప్పాయి తీసుకోవడం వల్ల కడుపు శుద్ధికి సహాయపడడంతో పాటు పేగుల పనితీరును సులభతరం చేస్తుంది.