పిల్లల ఆరోగ్యానికి తల్లి ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది. పోషకాలు ఉన్న ఆహారం పెట్టాలని కోరుకుంటుంది. అందులో భాగంగా ఎండుద్రాక్ష (Dry Grapes) చాలా ఉపయోగకరమైనది. వీటిని పిల్లల డైట్‌లో చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
బ్రెయిన్ డెవలప్మెంట్ : ఎండుద్రాక్షలో ఐరన్, విటమిన్ బి (Vitamin B) పుష్కలంగా ఉంటుంది. ఇవి జ్ఞాపకశక్తిని పెంచి, పిల్లల మైండ్ షార్ప్‌గా మారేందుకు సహాయపడతాయి. రెగ్యులర్‌గా వీటిని తినిపిస్తే విద్యలో కూడా ఫోకస్ పెరుగుతుంది.
ఇమ్యూనిటీ: ఎండు ద్రాక్షలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల ఇమ్యూన్ సిస్టమ్‌ను బలపరుస్తాయి. దీని వల్ల సీజనల్ సమస్యలు అయిన జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు దూరమవుతాయి. శరీర రక్షణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది.
రక్తహీనతకు సహజ పరిష్కారం: హిమోగ్లోబిన్, ఐరన్ పుష్కలంగా ఉన్న ఎండుద్రాక్ష పిల్లల రక్తహీనతను తగ్గిస్తుంది. ఇవి శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. ఎప్పుడూ నీరసంగా ఉండే పిల్లలకు ఇది ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది.
బలమైన ఎముకలు: ఎండుద్రాక్షలో ఉన్న కాల్షియం, బోరాన్ (Calcium & Boron) పిల్లల ఎముకలను బలంగా మార్చుతాయి. ఎదుగుతున్న వయసులో వీటిని తినిపిస్తే ఎముకల పెరుగుదల సరిగ్గా జరుగుతుంది. పాలు తాగనని పిల్లలకు ఇవి మంచి ప్రత్యామ్నాయం.
జీర్ణక్రియకు మేలు: ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఎండుద్రాక్ష జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు, ఆకలి కూడా పెరుగుతుంది.
చర్మం, కళ్ళ ఆరోగ్యానికి మేలు: ఎండుద్రాక్షలో విటమిన్ ఎ (Vitamin A) ఉంటుంది. ఇది పిల్లల కళ్ళకు మేలు చేసి చూపు మెరుగుపరుస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. చిన్న వయసులోనే ఆరోగ్యకరమైన అలవాట్లకు ఇది మంచి ఆరంభం.
గమనిక: పిల్లల్లో కొన్ని ఫుడ్స్ పట్ల ఎలర్జీస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మీ పిల్లలకి కొత్త పదార్థాలు తినిపించే ముందు డాక్టర్ని ఒకసారి సంప్రదించడం మంచిది.