సబ్జా గింజలు (Sabja Seeds) లేదా తులసి గింజలు మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. ఇవి చిన్నగా కనిపించినా పోషకాలతో నిండిపోయి ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు ఇవి ఉబ్బి జెల్లా మారతాయి. చల్లటి పానీయాలు, ఫలూడా, జ్యూస్ లలో వీటిని వేసుకుంటే రుచిగా, ఆరోగ్యంగా ఉంటాయి.
ఫైబర్: సబ్జా గింజల్లో ఫైబర్ (Fiber) అధికంగా ఉంటుంది. ఇవి మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తాయి. నీటిలో నానబెట్టి ఉదయం తీసుకుంటే గట్ హెల్త్ మెరుగుపడుతుంది.
బరువు నియంత్రణ: సబ్జా గింజల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని తీసుకున్న తర్వాత కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఈ ఫైబర్ వల్ల ఆకలి తగ్గి, అనవసరంగా తినడం తగ్గుతుంది. వెయిట్ లాస్ డైట్లో (Weight Loss diet) ఇవి ఒక మంచి ఆప్షన్‌గా పరిగణించవచ్చు.
బోన్ హెల్త్: ఇందులో ఉన్న కాల్షియం (Calcium) , మెగ్నీషియం(Magnesium) , ఐరన్ (Iron) వంటి ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచుతాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళ నొప్పులు, మంటలను తగ్గిస్తాయి. చలికాలంలో ఇవి ఎంతో ఉపయోగకరం.
షుగర్ నియంత్రణ: డయాబెటిస్ (diabetes) ఉన్నవారు రోజూ 1–2 టీస్పూన్ల సబ్జా గింజలను డైట్లో చేర్చుకుంటే బ్లడ్ షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. వీటిలోని సహజ గుణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.
జాగ్రత్తలు తప్పనిసరి: సబ్జా గింజలను ఎప్పుడూ నీటిలో నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. డ్రైగా తింటే బ్లోటింగ్ (Bloating) ప్రాబ్లమ్స్ రావచ్చు. రోజుకు 15 గ్రాముల వరకు మాత్రమే తీసుకోవడం మంచిది.