కండరాల బలం: రోజూ గుంజీలు తీయడం (Squats) ద్వారా పొత్తికడుపు, కాళ్ల కండరాలు బలంగా తయారవుతాయి. ఈ వ్యాయామం శరీరానికి సమతుల్యత అందిస్తుంది. క్రమంగా గుంజీలు చేస్తే కండరాల పెరుగుదలతో పాటు శరీరం మరింత దృఢంగా మారుతుంది.
బాడీ పోస్చర్: ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వారికి రోజూ 30 గుంజీలు తీయడం వెన్నెముకను బలపరుస్తుంది. ఇది శరీరాన్ని సరైన భంగిమలో ఉంచి వెన్నునొప్పిని నివారిస్తుంది.
జీర్ణక్రియ: గుంజీలు తీయడం వల్ల పొత్తికడుపు ,పేగు కండరాలు చురుకుగా పనిచేస్తాయి. దీని వలన మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి శరీరానికి శక్తిని అందిస్తుంది.
గుండె ఆరోగ్యం గుంజీలు తీయడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్య నిపుణులు (Health Experts) ప్రకారం రోజు గుంజలు తీయడం హార్ట్ హెల్త్ ను పెంచడానికి ఒక సహజ మార్గం.
వెయిట్ లాస్ గుంజీలు తీసుకోవడం మెటబాలిజాన్ని (Metabolism) పెంచి కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతుంది. తొడలు, పిరుదుల వద్ద పేరుకుపోయిన కొవ్వు కరిగి శరీర ఆకృతి సరిగ్గా ఉంటుంది. వెయిట్ లాస్ కోసం ఇది సులభమైన వ్యాయామం.
ఊపిరితిత్తుల శక్తి: గుంజీలు తీయేటప్పుడు శ్వాస వేగం పెరుగుతుంది. దీని వలన ఊపిరితిత్తులు గాలి తీసుకునే సామర్థ్యం పెరిగి శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీన్ని రోజువారీ అలవాటుగా మార్చుకుంటే శరీరం మొత్తం ఫిట్‌గా ఉంటుంది.
రోజూ 30 గుంజీలు తీయడం ద్వారా శరీర బలం, సమతుల్యత, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయి. మొదట ఐదు గింజలతో ప్రారంభించి క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. హార్ట్, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఎక్ససైజ్ చేసే ముందు డాక్టర్ను సంప్రదించడం మంచిది.