పండుగలు, శుభదినాల్లో చాలా మంది ఉపవాసం (Fasting) చేస్తారు. పైగా ఇది కార్తీక మాసం (Karthika Masam) కాబట్టి చాలామంది ఉపవాసం ఉంటుంటారు.ఈ సమయంలో ఘన ఆహారం తీసుకోకుండా ఎక్కువగా లిక్విడ్స్కి ప్రాధాన్యం ఇస్తారు. అప్పుడు చాలామంది టీ, కాఫీలు తాగుతూ ఉంటారు. తాగిన వెంటనే ఎనర్జీగా అనిపించినా, ఆరోగ్యపరంగా అది అంత మంచిది కాదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఉపవాసంలో కెఫిన్ ప్రభావం టీ, కాఫీల్లో కెఫిన్ (Caffeine) అధికంగా ఉంటుంది. ఇది కడుపులో ఆమ్లాలను (Acids) పెంచి అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉపవాస సమయంలో కడుపు ఖాళీగా ఉండటం వల్ల ఈ ప్రభావం మరింత ఎక్కువవుతుంది.
ఇన్స్టంట్ ఎనర్జీ భ్రమ టీ, కాఫీల్లోని చక్కెర కారణంగా కొంతసేపు ఎనర్జీగా అనిపించినా, కొద్దిసేపటికే బలహీనత, తలనొప్పి, నీరసం వస్తాయి. అందువల్ల ఇది తాత్కాలిక ఉత్సాహమే కానీ ఆరోగ్యానికి మంచిది కాదు.
డీహైడ్రేషన్ ప్రమాదం కెఫిన్ ఉన్న పానీయాలు శరీరంలోని నీటిని తగ్గిస్తాయి. దీని వల్ల డీహైడ్రేషన్, అలసట వస్తాయి. ఉపవాస సమయంలో నీరు తగినంతగా తాగకపోతే ఈ సమస్యలు మరింత పెరుగుతాయి.
మానసిక ప్రభావాలు హెల్త్ ఎక్స్పర్ట్స్ (Health Experts) ప్రకారం, కెఫిన్ అధికంగా తీసుకోవడం వలన యాంగ్జైటీ (Anxiety) , నిద్రలేమి (Insomnia), డిప్రెషన్ (Depression) వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు టీ, కాఫీల బదులుగా హెర్బల్ టీలు (Herbal Teas) – లెమన్ టీ, చామంతి టీ, డాండలీన్ టీ తాగడం మంచిది. ఇవి సహజ శక్తిని ఇస్తాయి.
పండ్లు తీసుకోవడం జ్యూస్ బదులు పండ్లు తినడం మంచిది. పండ్లలో ఫైబర్ (Fiber) ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. ఇలా చేస్తే ఉపవాసంలో ఆరోగ్యం కాపాడుకోవచ్చు.