నిద్ర విడాకులు అంటే ? ఇటీవల జంటల మధ్య కొత్తగా వినిపిస్తున్న పదం — నిద్ర విడాకులు (Sleep Divorce). ఇది నిజమైన విడాకులు కాదు. భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉండి, రాత్రివేళ వేరు వేరు గదుల్లో నిద్రించే పద్ధతినే స్లీప్ డివోర్స్ అంటారు . ఇది పరస్పర అవగాహనతో తీసుకునే నిర్ణయం.
ఎందుకు ఇలా చేస్తున్నారు? చాలామందికి రాత్రివేళ నిద్రలో భాగస్వామి గురక, టీవీ చూడటం, లేదా ఫోన్ ఉపయోగించడం వంటి అలవాట్లు ఇబ్బందిగా మారుతాయి. దీని వలన నిద్ర లోపం, ఒత్తిడి, తగాదాలు వస్తాయి. అందుకే కొంతమంది దంపతులు వేరు పడుకోవడం ద్వారా ప్రశాంతమైన నిద్రను ఎంచుకుంటున్నారు.
బంధానికి విరామమా లేదా పరిష్కరమా? నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది బంధం ముగిసిందనే కాదు. స్లీప్ డివోర్స్ అనేది సంబంధం కాపాడుకునే కొత్త మార్గంగా మారుతోంది. కొంతమంది మానసిక నిపుణులు (Psychologists) చెబుతున్నట్లుగా, ఇది చిన్న తగాదాలు పెరగకుండా నిలుపుతుంది.
కలిసి కానీ దూరంగా ఈ పద్ధతిలో భార్యాభర్తలు రోజువారీ బాధ్యతలు, కుటుంబ కర్తవ్యాలు సాధారణంగానే నిర్వహిస్తారు. కేవలం రాత్రి నిద్ర సమయానికే వేరు వేరు గదుల్లో నిద్రిస్తారు. ఇది వారి వ్యక్తిగత అలవాట్లను గౌరవించడం అనే భావనకు నిదర్శనం.
సంబంధానికి లాభం ఇది శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ, మానసికంగా దగ్గరగా ఉండేందుకు సహాయపడుతుంది. మంచి నిద్ర వల్ల ఉదయం మూడ్ బాగుంటుంది, దంపతుల మధ్య మాటల తగాదాలు తగ్గుతాయి.
నిపుణుల సూచన నిపుణుల ప్రకారం నిద్ర విడాకులు అనేవి సంబంధాన్ని చెడగొట్టేవి కావు. అవగాహనతో తీసుకున్న నిర్ణయం అయితే ఇవి బంధాన్ని మరింత బలపరుస్తాయి” అని.మొత్తంగా చెప్పాలంటే, స్లీప్ డివోర్స్ అనేది బంధం నుండి విడిపోవడం కాదు, కానీ ఒకరినొకరు గౌరవిస్తూ ప్రశాంతమైన జీవనానికి దారితీసే కొత్త ఆచారం.