రోజువారీ అలవాటు ఎవరి వంటింట్లో చూసినా ఇప్పుడు ప్లాస్టిక్ కంటెయినర్స్ (Plastic containers) తప్పనిసరి అయ్యాయి. కిచెన్ ఇంగ్రిడియెంట్స్ నుంచి లంచ్ బాక్స్ వరకు వాటి వాడకం విస్తరించింది. కానీ సరైన జాగ్రత్తలు లేకుండా వాడితే ఆరోగ్య సమస్యలు రావచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డ్రై ఫుడ్స్ ప్లాస్టిక్ కంటెయినర్స్‌లో డ్రై ఫుడ్స్ అంటే.. చిప్స్, నట్స్, స్నాక్స్ వంటివి మాత్రమే నిల్వ చేయడం మంచిది. వీటిలో పచ్చి మాంసం, వేడి వంటకాలు లేదా పుల్లటి పదార్థాలు ఉంచకూడదు.
శుభ్రత ప్రతి వాడకానికీ కంటెయినర్స్ కడిగి ఆరబెట్టాలి. గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు, సబ్బు కలిపి కడిగితే బ్యాక్టీరియా, దుర్వాసనలు దూరంగా ఉంటాయి. ఇది స్టెరిలైజేషన్‌లో సహాయపడుతుంది.
ప్లాస్టిక్ కంటెయినర్స్‌ను వేడి తగలని చల్లని ప్రదేశంలో ఉంచాలి. ఎండ లేదా తడి తగలకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేస్తే కంటెయినర్స్ లైఫ్ పెరుగుతుంది, అందులోని ఫుడ్ కూడా తాజాగా ఉంటుంది.
మొత్తం మీద, ప్లాస్టిక్ వాడకం పూర్తిగా మానేయడం సాధ్యం కాకపోయినా, సరైన రకం కంటెయినర్స్‌ను ఎంపిక చేసి శుభ్రత పాటిస్తే ఆరోగ్యానికి హాని కలగదు.