ఇప్పటి బిజీ జీవితంలో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం తగ్గిపోయింది. దీనివల్ల పిల్లలు బద్ధకంగా మారి, మొబైల్ గేమ్స్, టీవీ వరకు మాత్రమే పరిమితమవుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు శారీరకంగా చురుకుగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామాలు చేయించాలి.
స్ట్రెచింగ్: రోజూ స్ట్రెచింగ్ చేయడం వల్ల శరీరంలో అధిక కొవ్వు తగ్గి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ముఖ్యంగా వెన్నెముక (Spine) సరిగా ఉండటంతో హైట్ పెరగడంలో సాయం చేస్తుంది. ఇది పిల్లలలో మానసిక ఉత్సాహాన్ని కూడా పెంచుతుంది.
జంపింగ్: పిల్లలతో ఆటపాటగా జంపింగ్ చేయించడం వల్ల బోన్ డెన్సిటీ (Bone Density) పెరుగుతుంది. క్రమంగా హైట్ పెరగడమే కాకుండా, కాళ్లు, మోకాళ్లు బలపడతాయి. క్యాల్షియం ఉన్న ఆహారం తీసుకుంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయి.
బాస్కెట్ బాల్: బాస్కెట్ బాల్ ఆడేటప్పుడు పరిగెత్తడం, ఎగరడం, స్ట్రెచింగ్ అన్నీ జరుగుతాయి. దీని వలన కండరాలు దృఢంగా మారుతాయి. ఇది గ్రోత్ హార్మోన్లను ప్రేరేపించి హైట్ పెరుగుదలకు తోడ్పడుతుంది.
సైక్లింగ్: సైక్లింగ్ పిల్లలకు ఎంతో ఇష్టమైన వ్యాయామం. ఇది ఎముకల బలం పెంచడంతో పాటు కాళ్ల కండరాలను బలోపేతం చేస్తుంది. రెగ్యులర్‌గా చేస్తే ఎత్తు పెరగడంలో సహాయపడుతుంది.
మొత్తంగా, పిల్లల శారీరక ఎదుగుదల తో పాటు మానసిక చురుకుదనానికి రోజువారీ వ్యాయామం చాలా అవసరం. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఈ అలవాటును ప్రోత్సహించడం సమాజానికి ఆరోగ్యకరమైన తరాన్ని అందిస్తుంది.