ఇప్పుడు చాలామంది జుట్టు అందంగా కనిపించాలనే ఆరాటంలో కెమికల్ (Chemical) ట్రీట్మెంట్స్ చేస్తుంటారు. కానీ అవి కొంతకాలం తర్వాత జుట్టు బలహీనమయ్యేలా చేస్తాయి. అందుకే ఇంట్లోనే సహజమైన పదార్థాలతో జుట్టు సంరక్షణ చేయడం మంచిది.

మ్యాజిక్ షాట్: ఉసిరి, అల్లం , కరివేపాకులు  — ఈ మూడింటి కలయిక జుట్టు పెరుగుదలకి అద్భుత ఫలితాలు ఇస్తుంది. వీటిని బ్లెండ్ చేసి కొద్దిగా నీరు కలిపి వడకట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ప్రతిరోజు ఈ జ్యూస్ ను ఒక చిన్న షాట్‌లా తీసుకుంటే జుట్టు లోపలి నుంచి బలపడుతుంది.

ఉసిరి లాభాలు ఉసిరిలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది హెయిర్ ఫోలికల్స్‌ను బలపరచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టు ముందుగానే తెల్లబడకుండా నిరోధిస్తుంది.

అల్లం: అల్లం (Ginger) స్కాల్ప్ బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగుపరచి జుట్టు రూట్స్ బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్స్ తగ్గించి జుట్టును మొదల నుంచి బలంగా మారుస్తుంది.

Sleep More

Are you getting at least 8 hours (or more) of sleep a night? Tracking sleep can definitely help you figure out.

Tip 2

కరివేపాకు: కరివేపాకుల్లో ఉన్న ఐరన్, ఫాస్ఫరస్ జుట్టు కుదుళ్లను దృఢంగా చేస్తాయి. హెయిర్ మాస్క్ లో కరివేపాకు కలపడం వల్ల స్కేల్ మీద ఇన్ఫెక్షన్స్ తగ్గి ఆరోగ్యంగా మారుతుంది.ఇది చుండ్రును కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

Tip 3

ఆరోగ్యకరమైన ఆహారం: జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్లు, ఆకుకూరలు, బయోటిన్ (Biotin) ఫుడ్స్ తినాలి. నీరు ఎక్కువగా తాగాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి.

విశ్రాంతి: సరైన నిద్రతో జుట్టు సహజంగా ఒత్తుగా పెరుగుతుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర శరీరంపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా హార్మోన్ సమతుల్యతను మెయింటైన్ చేస్తుంది. దీనివల్ల జుట్టు ఊడడం తగ్గుతుంది.