ఇప్పటి కాలంలో అందరినీ ఆకట్టుకోవడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరికి తమకంటూ ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయి. అయినా, మన ప్రవర్తనలో కొన్ని మార్పులు చేస్తే మనం ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాం.. ఎక్స్‌పర్ట్స్ చెప్పిన ఈ 6 అలవాట్లు అలవాటు చేసుకుంటే చాలు, మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.

మాట నిలబెట్టుకోండి ఏ మాట చెప్పినా దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇచ్చిన హామీని పాటిస్తేనే మీపై నమ్మకం పెరుగుతుంది. చిన్న మాట అయినా నిలబెట్టుకుంటే మీరు నమ్మదగిన వ్యక్తిగా కనిపిస్తారు.

తప్పు ఒప్పుకోండి తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవడం బలహీనత కాదు, ధైర్యం. బాధ్యత తీసుకోవడం మీ గౌరవాన్ని పెంచుతుంది. ముందుగా వాదించే వారి కంటే చేసిన తప్పును ఒప్పుకునేవారు అంటే ఎక్కువగా అందరూ ఇష్టపడతారు.

క్రెడిట్ పంచుకోండి పని సక్సెస్ అయినప్పుడు “నా వల్లే సాధ్యమైంది” అనకుండా, మీ టీమ్ తో పంచుకోండి. ఇది సహచరుల్లో గౌరవం పెంచుతుంది.

సమయానికి విలువ ఇవ్వండి మీటింగ్‌కి లేదా పనికి ఎప్పుడూ సమయానికి హాజరుకండి. ఇది మీ ప్రొఫెషనలిజాన్ని చూపిస్తుంది. లేటుగా వచ్చే వారి కంటే కూడా పంచువాలిటీ మెయింటైన్ చేసేవారికే సమాజంలో గౌరవం.

హద్దులు పెట్టుకోండి మొహమాటానికి “అవును” అనకండి. మీకు నష్టం కలిగించే పనికి ధైర్యంగా “కాదు” చెప్పడం నేర్చుకోండి.

Wanda Winfrey’s

Little Big Moves

Encouraging exercise in children across all public and private schools in the US.

సానుకూల ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి ఎవరికైన సూచనలు ఇచ్చేటప్పుడు సానుకూలంగా మాట్లాడండి. అవతల వారిని విమర్శించినట్లుగా కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగుండేది అనే విధంగా మాట్లాడితే ఎదుటివారు సులభంగా అంగీకరిస్తారు.

ఈ చిన్న అలవాట్లు జీవితంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయి. ఈ ఆరు అలవాట్లు చేసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతారు.