గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ ఫిజికల్ యాక్టివిటీతో పాటు సరైన ఆహారం చాలా ముఖ్యం. అందులో గుమ్మడి గింజలు ప్రత్యేక స్థానం సంపాదించు కున్నాయి. వీటిలో ఉన్న మెగ్నీషియం, జింక్, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి రక్తపోటును నియంత్రించి, గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.

"

కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి: ఈ గింజల్లో ఉండే ఫైటోస్టిరాల్స్ (Phytosterols) చెడు కొలెస్ట్రాల్‌ (LDL)‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ (HDL)‌ని పెంచుతాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు, యాంటీ ఆక్సిడెంట్స్ (Antioxidants) రక్తనాళాల దెబ్బతినకుండా కాపాడుతాయి.

ఇమ్యూనిటీ మరియు బ్లడ్ షుగర్ కంట్రోల్ జింక్‌ అధికంగా ఉండటం వలన హార్మోన్ల సమతుల్యత, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. మెగ్నీషియం గుండె కండరాల బలాన్ని పెంచుతుంది.

తినే సరైన విధానం: రోజూ సుమారు 30 గ్రాముల గుమ్మడి గింజలు తీసుకోవడం మంచిది. వీటిని నేరుగా, నానబెట్టి లేదా స్వల్పంగా రోస్ట్ చేసి తినవచ్చు. సలాడ్స్, స్మూతీస్ లేదా యోగర్ట్‌లో కలిపి తీసుకుంటే రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.

Curved Arrow

రోజువారీ ఆహారంలో గుమ్మడి గింజలను చేర్చడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

సహజ సిద్ధమైన పదార్థాలను మీ డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల జీవన శైలిలో ఎన్నో ఆరోగ్యకరమైన మార్పులను తీసుకురావచ్చు.