టైటుగా ఉండే బట్టలు (Tight Clothes) ఫ్యాషన్‌కి స్టైలిష్‌గా కనిపించినా, అవి సౌకర్యాన్ని తగ్గిస్తాయి.అందం కోసం వేసుకునే ఈ బట్టలు శరీరానికి ఒత్తిడి పెంచి ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని మీకు తెలుసా?
శరీర భంగిమపై ప్రభావం: ఫ్యాషన్ కోసం చాలామంది టైటుగా ఉండే బట్టలు (Tight Clothes) వేసుకుంటారు. కానీ ఇవి శరీర భంగిమ ను దెబ్బతీయొచ్చు. చాలా టైటుగా ఉన్న ప్యాంట్లు లేదా జీన్స్ నడుము, వెన్ను, నడుము కండరాలపై ఒత్తిడి పెంచుతాయి. దీని వల్ల నడుము నొప్పి, భుజాల నొప్పి రావచ్చు.
చర్మానికి ఇబ్బందులు టైటు బట్టలు శరీరంలో చెమటను సరిగా ఆవిరి కాకుండా చేస్తాయి. దీని వల్ల చర్మంపై ర్యాష్‌లు, యీస్ట్ ఇన్‌ఫెక్షన్ (Yeast Infection) వంటి సమస్యలు రావచ్చు.
నరాలు మరియు రక్త ప్రసరణ సమస్యలు చాలా గట్టిగా ఉన్న బట్టలు రక్తప్రసరణ కు అంతరాయం కలిగిస్తాయి. ముఖ్యంగా బెల్ట్ లేదా టైటు ప్యాంట్లు నరాలను ఒత్తిడికి గురి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో “మేరాల్జియా పేరేస్తెటికా ” అనే నర సమస్య వస్తుంది. దీని వల్ల తొడ ప్రాంతంలో తిమ్మిరి , ఒత్తిడి,నొప్పి అనిపించవచ్చు.
జీర్ణక్రియ సమస్యలు: టైటుగా ఉన్న బట్టలు కడుపుపై ఒత్తిడి పెంచి జీర్ణక్రియ (Digestion)ను దెబ్బతీయొచ్చు. దీని వల్ల గ్యాస్, ఎసిడిటీ, బొప్పి, అసౌకర్యం లాంటివి వస్తాయి. కొంతమంది లో “ఆసిడ్ రీఫ్లక్స్ (Acid Reflux)” సమస్య కూడా పెరగవచ్చు.
నిపుణుల సూచన: బట్టలు వేసుకున్నప్పుడు అవి సౌకర్యంగా ఉన్నాయా లేదా గమనించాలి. టైటు దుస్తులు రోజూ కాకుండా, అప్పుడప్పుడు మాత్రమే వేసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.