రాగులు, నువ్వులు: రాగులు (Ragi) పిల్లల్లో హిమోగ్లోబిన్ పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉన్న ఐరన్, క్యాల్షియం ఎముకలను బలపరుస్తాయి. నువ్వులు (Sesame Seeds) కూడా ఐరన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి జీర్ణ శక్తిని మెరుగుపరిచి రక్తహీనతను తగ్గిస్తాయి.
దానిమ్మ (Pomegranate) లో ఐరన్ అధికంగా ఉండి హిమోగ్లోబిన్ పెరగడంలో సహాయపడుతుంది.
డేట్స్ (Dates) పిల్లల్లో శక్తిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పిస్తా (Pista) లో ఉన్న విటమిన్లు , మినరల్స్ ఎముకలను బలపరుస్తాయి.
గోంగూర (Gongura), పాలకూర (Palak),బచ్చల కూర పొన్నగంటాకు వంటి ఆకు కూరలు ఐరన్‌కు మంచి మూలం. వారంలో కనీసం రెండుసార్లు ఆకుకూరలు తినడం వల్ల రక్తహీనత సమస్యతో పాటు కంటి సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.
ఈ ఆహారాలను వారంలో కనీసం రెండు మూడు సార్లు ఇవ్వడం ద్వారా పిల్లల్లో రక్తహీనత తగ్గి, శారీరక ఎదుగుదల మెరుగుపడుతుంది.