అమెరికా కు ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి పదవి కాలం పెంపు

అమెరికా కు ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి పదవి కాలం పెంపు

01-02-2018

అమెరికా కు ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి పదవి కాలం పెంపు

రెండు సంవత్సరాల క్రితం ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమెరికా లో ఉన్న శ్రీ జయరామ్ కోమటి ని ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి గా నియమించిన విషయం అందరికి తెలిసినదే!

ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధి గా అమెరికా లో ఉన్న తెలుగు వారిని  'AP జన్మభూమి' తరుపున వారి వారి గ్రామాలకు సేవ చేసే విధంగా చైతన్య పరిచి ఇప్పటి వరకు దాదాపు గా 2600 ప్రభుత్వ పాఠశాల లలో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశారు. ఇంకా 400 ఆంగనవాడి కేంద్రాలు నిర్మించటం లో, దాదాపు 100 కు పైగా గ్రామాలలో స్మశాన వాటిక లు కట్టించటం లో  ముఖ్యపాత్ర వహించారు. అంతే కాకుండా కాలిఫోర్నియా రాష్ట్రం లో తన నివాస పట్టణం శాన్ హోసే లో ఆఫీసు ఏర్పాటు చేసి, అమెరికా వస్తున్న టీడిపి నాయకులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటనలు సంధానం చేస్తూ ప్రభుత్వానికి ఎంతో సేవ చేస్తున్నారు.

శ్రీ జయరామ్ కోమటి ని ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పదవి కాలం మరో రెండు సంవత్సరాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.