ఎపి జన్మభూమి 'సేవ'లో పాలుపంచుకోండి
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

ఎపి జన్మభూమి 'సేవ'లో పాలుపంచుకోండి

16-05-2018

ఎపి జన్మభూమి 'సేవ'లో పాలుపంచుకోండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేస్తున్నామని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లను డిజిటల్‌మయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ లక్ష్యసాధనలో ఎన్నారైలు కూడా పాలుపంచుకోవాలని ఆయన కోరారు.

ఎన్నారైలు ఇచ్చే 400 డాలర్ల విరాళానికి తోడుగా, జిల్లా యంత్రాంగం 600 డాలర్లను ఇస్తోందని, ఈ నిధులతో జిల్లాలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేస్తామని జయరామ్‌ కోమటి వివరించారు. డిజిటల్‌ తరగతుల ఏర్పాటు కోసం ఇచ్చే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుందని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం www.apjanmabhoomi.org ని సంప్రదించవచ్చని చెప్పారు.