టాటా అద్వితీయ...'ద్వితీయం'

టాటా అద్వితీయ...'ద్వితీయం'

08-04-2017

టాటా అద్వితీయ...'ద్వితీయం'

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం అద్వితీయ...'ద్వితీయం' పేరుతో సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ 29వ తేదీన టెక్సాస్‌ ఫ్రిస్కోలోని డా. పెప్పెర్‌ ఏరినాలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు టాటా అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి తెలిపారు. ఈ వేడుకలకు ఎంతోమంటి స్టార్‌లు వస్తున్నారని, అమెరికాలోని రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతున్నట్లు ఆమె చెప్పారు. రాజా కృష్ణమూర్తి, లారా హిల్‌తోపాటు ఇతర ప్రముఖులు వస్తున్నట్లు తెలిపారు. సినీ తారలు భానుప్రియ, నిఖిల్‌, స్వాతి రెడ్డి, కమలినీ ముఖర్జీ, మధు శాలిని, వినయ్‌ తదితరులతోపాటు గాయనీ గాయకులు హేమచంద్ర, శ్రావణభార్గవి తదితరులు తమ పాటలతో అలరించనున్నారని చెప్పారు. ఈ వేడుకలకు కోహినూర్‌ స్పాన్సర్‌గా టాటా అడ్వయిజరీ చైర్మన్‌ డా. పైళ్ళ మల్లారెడ్డి వ్యవహరిస్తున్నారు.