సెప్టెంబర్‌ 2,3 తేదీల్లో అమెరికా కూచిపూడి సమ్మేళనం

సెప్టెంబర్‌ 2,3 తేదీల్లో అమెరికా కూచిపూడి సమ్మేళనం

16-08-2017

సెప్టెంబర్‌ 2,3 తేదీల్లో అమెరికా కూచిపూడి సమ్మేళనం

ఆంధ్రప్రదేశ్‌ భాష, సాంస్కృతిక శాఖ సహకారంతో సిలికానాంధ్ర సంస్థ అమెరికాలో అమెరికా కూచిపూడి డ్యాన్స్‌ కన్వెన్షన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్‌ 2,3 తేదీల్లో సిలికానాంధ్ర యూనివర్సిటీలోని డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమం కోసం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కళారత్న శ్రీమతి బాల కొండల్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకు ప్రత్యేక శిక్షణను కూడా ఇస్తున్నారు. ఇతర వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ను చూడండి.

http://akdc.siliconandhra.org/