అమెరికాలో బాహుబలి క్రేజీ...దోపిడీ

అమెరికాలో బాహుబలి క్రేజీ...దోపిడీ

24-04-2017

అమెరికాలో బాహుబలి క్రేజీ...దోపిడీ

అమెరికాలో బాహుబలి సినిమాకు ఉన్న క్రేజీని దృష్టిలో పెట్టుకుని టిక్కెట్ల రేట్లను కూడా ఎడాపెడా పెంచేయడంపై సగటు ప్రేక్షకుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. సినిమాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రీమియర్‌ షోలతోపాటు రెగ్యులర్‌ షోలకు కూడా నిర్ణీత ధర కన్నా ఎక్కువ రేట్లను వసూలు చేయడం పరిపాటి అయిపోయింది. ఇప్పుడు బాహబలి టిక్కెట్‌ ధరను 33-42 డాలర్లకు విక్రయించడంపై ప్రేక్షకులు గరం గరం అవుతున్నారు. అవతార్‌ వంటి సినిమాలకు 5-10 డాలర్ల మధ్యనే టిక్కెట్‌ పెట్టారని, దానికి మించి పెద్ద సినిమా బాహుబలినా అని ప్రశ్నిస్తున్నారు. బాహుబలి సినిమా బాగానే తీసి ఉండవచ్చు. కాని ఆ సినిమాను థియేటర్‌లో కుటుంబసభ్యులతో కలిసి చూసి ఆనందించాలంటే టిక్కెట్‌ రేట్‌ తగ్గించాలని అంటున్నారు.