రెగ్యులర్ కమర్షియల్ మూవీ 'యం యల్ ఏ'

రెగ్యులర్ కమర్షియల్ మూవీ 'యం యల్ ఏ'

30-03-2018

రెగ్యులర్ కమర్షియల్ మూవీ 'యం యల్ ఏ'

తెలుగుటైమ్స్.నెట్  రేటింగ్ 2.5/5 

బ్యానర్ : బ్లూ  ప్లానెట్  ఎంటర్టైన్మెంట్స్, 

నటీనటులు : కళ్యాణ్ రామ్, కాజల్, బ్రహ్మానందం, మనాలి రాథోడ్, వెన్నెల కిశోర్, లాష్య, ప్రిథ్వి రాజ్,
రవి కిషన్, పోసాని కృష్ణ మురళి,అజయ్, జయ ప్రకాష్ రెడ్డి, శివాజీ రాజా తది తరులు... 

సంగీతం :మణిశర్మ, సినిమాటోగ్రఫర్ :ప్రసాద్ మురెళ్ళ, ఎడిటర్ :తమ్మిరాజు
నిర్మాతలు : కిరణ్  రెడ్డి, భరత్  చౌదరి, టి జి విశ్వ  ప్రసాద్ 
కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం : ఉపేంద్ర మాధవ్

విడుదల తేదీ :23.3.2018

దాదాపు దశాబ్డం తరువాత  కళ్యాణ్ రామ్ కాజల్ జంట గా నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో బ్లూ  ప్లానెట్  ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కిరణ్  రెడ్డి, భరత్  చౌదరి, టి జి విశ్వ  ప్రసాద్ నిర్మించిన   సినిమా ‘ఎం.ఎల్.ఏ’. ఈరోజె విడుదలైన ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎంతమేర ఆకట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

కథ :

సరదా గా  జీవితం గడుపుతున్న కళ్యాణ్ (కళ్యాణ్ రామ్) బావతో బెంగళూరు వెళ్లి అక్కడ ఇందు (కాజల్) ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న కళ్యాణ్ కు ఇందు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుస్తుంది. ఈ టైంలో కళ్యాణ్ ఎం.ఎల్.ఏగా మారాలని నిర్ణయించుకుంటాడు. గాడప్ప (రవికిషన్)కు పోటీగా రంగంలో దిగాలని అనుకుంటాడు కళ్యాణ్. ఇంతకీ అసలు ఇందు ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? కళ్యాణ్ ఎందుకు ఎం.ఎల్.ఏ గా ఎందుకు  మారాలనుకుంటాడు..? చివరకు అతను ఎం.ఎల్.ఏ అయ్యాడా అన్నది సినిమా కథ.

ఆర్టిస్ట్ పెర్ఫామెన్స్:

కళ్యాణ్ రామ్ ఎప్పటిలానే తన ఈజ్ తో సినిమాలో నటించారు. ముఖ్యంగా సినిమాలో కాస్త కామెడీ టైమింగ్ కూడా ట్రై చేశాడు కళ్యాణ్ రామ్. మాస్ డైలాగ్స్ బాగా చెప్పి అలరించాడు. ఇక ఇందుగా కాజల్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. అందం, అభినయం కలిసి కాజల్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక రవి కిషన్ విలనిజం బాగుంది. వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి, పృధ్వి రాజ్ కామెడీ అలరించింది.

సాంకేతిక వర్గం:

ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి లుక్ తీసుకొచ్చింది. కెమెరా మెన్ పనితనం బాగుంది. ఇక సినిమాలో డైలాగ్స్ కూడా నందమూరి ఫ్యాన్స్ ను అలరిస్తాయి. మణిశర్మ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. వేణు ఊడుగుల రొటీన్ స్టోరీని ఎంచుకుని పర్వాలేదనే రీతిలో సినిమాను తెరకెక్కించారు. కథ కథనం డైరక్షన్ అంతా సినిమా ఫన్ ఫుల్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. కమర్షియల్ అంశాలు బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ కూడా ఓకే అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ లో సినిమా రిచ్ గా ఉంటుంది. 

విశ్లేషణ :

కళ్యాణ్ రాం ఎం.ఎల్.ఏ వేణు ఊడుగుల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అయితే సినిమా అంతా ఎక్కడ బోర్ కొట్టకుండా దర్శకుడు  కాస్త జాగ్రత్త పడ్డాడు. కళ్యాణ్ రాం కు పటాస్ సినిమా ఛాయలు కనిపిస్తాయి. అందులో పోలీస్ గా విలన్ల పని పడితే.. ఇందులో పొలిటిషియన్ గా మారేందుకు విలన్ల ఆట కట్టిస్తాడు. మొదటి భాగం అంతా ఎంటర్టైనింగ్ గా సాగగా.. సెకండ్ హాఫ్ సీరియస్ గా నడుస్తుంది. కథనం ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. సినిమా చూస్తున్నంత సేపు ఏదో పాత సినిమానే చుస్తున్నామా అనిపిస్తుంది. కళ్యాణ్ ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ తో సేఫ్ గేం ఆడేయొచ్చని నిరూపించుకున్నాడు.యూత్ ఫుల్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎంటర్టైన్ అయ్యే అవకాశం ఉంది. నందమూరి ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చేస్తుంది.