రివ్యూ : పవన్ కళ్యాణ్ మార్క్ మూవీ 'అజ్ఞాతవాసి'

రివ్యూ : పవన్ కళ్యాణ్ మార్క్ మూవీ 'అజ్ఞాతవాసి'

10-01-2018

రివ్యూ : పవన్ కళ్యాణ్ మార్క్ మూవీ  'అజ్ఞాతవాసి'

తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ : 2.75/5

బ్యానర్ : హారిక  & హాసిని  క్రియేషన్స్

నటి నటులు : పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్, ఆది పినిశెట్టి, ఖుష్బూ సుందర్, బొమ్మన్ ఇరానీ, తనికెళ్ళ భరణి, పరాగ్ త్యాగి, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్, అజయ్, వెన్నెల కిశోర్, సమీర్ హాసన్, శ్రీనివాస్ రెడ్డి, అదుకాలం నరేన్, మరియు జయ ప్రకాష్ తదితరులు...

కథ మూలం :'లార్గో  వించ్'  ఫ్రెంచ్ సినిమా, సంగీతం : అనిరుద్ రవిచందర్
పాటలు: సిరి వెన్నెల సీతరామ శాస్ట్రీ, భాస్కర బట్ల, శ్రీ మణి, ఒత్తుక్కుడు  వెంకట సుబ్బాయర్
సినిమాటోగ్రఫీ : వి. మణికంధన్, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర్ రావు
నిర్మాత : యస్.రాధా కృష్ణ (చినబాబు)
కథ, మాటలు, స్క్రీన్ ప్లే : త్రివిక్రమ్ శ్రీనివాస్

విడుదల తేదీ: 10.01.2018  


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్  కాంబినేషన్ లో,  పవన్ కళ్యాణ్ 25వ సినిమా వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ లో చిత్రం వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  అభిమానులతో పాటు, యావత్ తెలుగు సినీ లోకం ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం సంక్రాంతి సందర్భంగా  ఈ రోజు రికార్డు స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యింది ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, ల హిట్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ: 

ఏబి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని అయిన విందా (బోమన్ ఇరానీ), అతని కొడుకు(టివి ఆర్టిస్ట్ అశోక్ కుమార్ తనయుడు)ను కంపెనీ  చైర్మన్ పదవి కోసం కొందరు హత్య చేస్తారు. దాంతో విందా భార్య ఇంద్రాణి (ఖుష్బు) ఇరవై ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న తమ పెద్ద కుమారుడు అభిషిక్త్ భార్గవ్ (పవన్ కళ్యాణ్) ను కంపెనీని కాపాడమని, తండ్రిని చంపిన వాళ్ళను కనిపెట్టమని వెనక్కి పిలుస్తుంది. దానికోసం తన తండ్రి స్థాపించిన ఏబి గ్రూప్  సాఫ్ట్ వేర్ కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అవుతాడు అభిజిత్ భార్గవ్. ముందుగా తన తండ్రి మరణానికి కారణం  ఏబి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో బోర్డు అఫ్ డైరెక్టర్స్ అయినా వర్మ(రావు రమేష్) శర్మ (శర్మ) అనుకుంటాడు అందుకు వర్మ కూతురు(కీర్తి సురేష్) ని, శర్మ కు అత్యంత ఇష్టమైన (అను ఇమ్మాన్యుయెల్) ని పరిచయం చేసుకుంటాడు.  అలా తండ్రి, తమ్ముడి మరణానికి నిజమైన హంతకులపై  పగ తీర్చుకునేందుకు బయటికొచ్చిన అభిషిక్త్ భార్గవ్ నేరస్తుల్ని ఎలా కనిపెడతాడు, వారి మీద పగ ఎలా తీర్చుకుంటాడు, అసలు అభిషిక్త్ భార్గవ్ అజ్ఞాతంలో ఎందుకు ఉండవలసి వస్తుంది అనే అంశాల సమాహారమే అజ్ఞాతవాసి సినిమా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో మరోసారి అజ్ఞాతవాసి ప్రూవ్ చేసింది. ఆయన కనిపించే సన్నివేశాలు చాలా వరకు అభిమానుల్ని అలరిస్తాయి. ఫుల్ ఎనర్జీతో, తన ట్రేడ్ మార్క్ మ్యానరిజంతో పవర్ స్టార్ సినిమాను నెట్టుకురావడానికి చాలానే ప్రయత్నించాడు. కథలో అభిజిత్ భార్గవ్ పాత్ర త్రివిక్రమ్  పవన్ కోసం దాన్ని మలచిన తీరు ఆకట్టుకుంటాయి. ఇక  త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ పవన్ నోటి వెంట వస్తుంటే థియేటర్ లో క్లాప్స్ పడుతున్నాయి. పవన్ నట విశ్వరూపం చూపించాడని సింపుల్ గా చెప్పొచ్చు. సినిమా మొత్తం పవన్ తన భుజాన వేసుకుని నడిపించాడు. ఇక హీరోయిన్స్ కీర్తి హోంలీగా అనిపించగా.. అను ఇమ్మాన్యుయెల్ హాట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఆది పినిశెట్టి విలనిజం బాగుంది. వర్సటైల్ యాక్ట్రెస్ కుష్బు నటన బాగుంది.ఇక కుష్బు, పవన్ ల మధ్య ఉండే తల్లి, కొడుకుల రిలేషన్ ను ఎలివేట్ చేసే సన్నివేశాలు, వాటిలో ఇద్దరి నటన మెప్పించాయి. రావు రమేష్ ఎప్పటిలానే అదరగొట్టగా..ముఖ్యంగా రావు రమేష్ పాత్ర యొక్క డైలాగులు త్రివిక్రమ్ స్టైల్లో ఉండి అలరించాయి.  మురళి శర్మ ఆకట్టుకున్నారు. రఘుబాబు, వెన్నెల కిశోర్ కాసేపు నవ్వించేశారు.

సాంకేతికవర్గం పని తీరు:

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా, దర్శకుడిగా తన వంతు భాద్యతను సక్రమంగా ఈ చిత్రం లో నిర్వహించలేదు అని చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్పదగిన మంచి స్టోరీ లైన్ ను తీసుకుని సరైన కథనం, పాత్రలు, సన్నివేశాలు రాసుకోకుండా అలసత్వం ప్రదర్శించి ఏదో కొన్ని చోట్ల మినహా అభిమానులు కూడా పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయదగిన విధంగా లేకుండా సినిమాను తయారుచేశారు. కనీసం మాటల్లో కూడా తనదైన మ్యాజిక్ ను ప్రదర్శించలేకపోయారు. ఇక అనిరుద్ రవిచందర్ సంగీతం క్లాస్ గానే ఉన్నా పవన్ సినిమాలో వుండే  ఊపు తెప్పించే విధంగా లేకపోవడంతో సినిమాకది పెద్దగా ఉపయోగపడలేకపోయింది. అలాగే సెకండాఫ్లో వచ్చే కొడకా కోటేశ్వర్ రావ్ పాటలో మాత్రమే పవన్ కొద్దిగా మాస్ స్టెప్పులు వేయడంతో హుషారు కలిగింది.  వి. మణికంధన్ సినిమాటోగ్రఫీ బాగుంది అద్భుతంగా వుంది. ప్రతి ఫ్రేమ్ క్వాలిటీగా కనిపించింది. కోటగిరి వెంకటేశ్వరరావ్ గారి ఎడిటింగ్ పర్వాలేదు. ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ బాగానే ఉన్నాయి. నిర్మాత ఎస్.రాధా క్రిష్ణగారు నిర్మాతగా ఒక సినిమాకు ఎంత చేయాలో అంతా చేసి సాంకేతికంగా మంచి నాణ్యత గల సినిమాను అందించారు.

విశ్లేషణ:

ఈ ‘అజ్ఞాతవాసి’ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోవడవంలో చాలా వరకు విఫలమైంది. త్రివిక్రమ్ కథా కథనాల రచనలో, టేకింగ్లో, పాత్ర చిత్రీకరణలో, కనీసం మాటల్లో కూడా తన సహజమైన మార్కును చూపించలేదు. దీంతో సినిమా స్థాయి చాలా వరకు పడిపోయింది. అక్కడక్కడా పవన్ పెర్ఫార్మెన్స్, కొంత కామెడీ, కొంతమేర పర్వాలేదనిపించిన పాటలు, ఫైట్స్, చిన్నపాటి ఇంటర్వెల్ ఎలిమెంట్, తల్లి, కొడుకుల సెంటిమెంట్ మినహా ఈ సినిమాలో ఎంజాయ్ చేయడానికి, ఎగ్జైట్ ఫీలవ్వడానికి ఏమీ దొరకదు. మొత్తం మీద చెప్పాలంటే పవన్, త్రివిక్రమ్ ల హార్డ్ కోర్ అభిమానులకు ఈ చిత్రం పర్వాలేదనిపింవచ్చు కానీ మిగతా ప్రేక్షకులకు ఓ సాదా సీదా సినిమాగా ఫీల్ అవుతాడు.