రివ్యూ : మణిరత్నం వెండితెర దృశ్య కావ్యం 'చెలియా'

రివ్యూ : మణిరత్నం వెండితెర దృశ్య కావ్యం 'చెలియా'

07-04-2017

రివ్యూ : మణిరత్నం వెండితెర దృశ్య కావ్యం 'చెలియా'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 2.75/5

బ్యానెర్లు : మద్రాస్ టాకీస్ & శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,

నటీనటులు : కార్తి, అదితిరావ్ హైదరి,K. P. A. C. లలిత, శ్రద్ధ  శ్రీనాథ్,రుక్మిణి  విజయకుమార్,ఢిల్లీ  గణేష్,
R J బాలాజీ,శివకుమార్  అనంత్,అమృత సింగ్ తది తరులు....

సినిమాటోగ్రఫీ : రవి వర్మన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, సంగీతం : ఏఆర్ రెహమాన్,

సమర్పణ: దిల్ రాజు, శిరీష్, కథ, నిర్మాత, దర్శకత్వం : మణిరత్నం

విడుదల తేదీ : 07.03.2017

 

90వ దశకం నుండి ఈ రోజు వరకు  యువతరం లో ఓ క్రేజ్ వున్నా డైరెక్టర్లలో ఒకరు  మణిరత్నం.  ఆయన సినిమా అంటేనే అన్ని రకాల  ప్రేక్షకులకు ఆసక్తి, అంచనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం కార్తి, అదితిరావ్ హైదరీలు జంటగా ఆయన రూపొందించిన చిత్రం తెలుగు లో  ‘చెలియా’, 'కాట్రు వెళియిదై' తమిళం లో కూడా  ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని అంచులను ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ : 

1999 కార్గిల్ యుద్ధం జరిగే సమయంలో వరుణ్(కార్తి) ఫైటర్ ఫైలెట్ గా బోర్డర్ లో పనిచేస్తుంటాడు. తన మాటే సాహసనంగా నడుకుచుకోవాలనుకునే వరుణ్ ఓ యాక్సిడెంట్ కారణంగా డాక్టర్ లీలా (అదితి రావు హైదరి)ని కలుసుకుంటాడు. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిన వరుణ్ ఆమెకు సర్ ప్రైజ్ లు ఎన్నో ఇస్తాడు. తను చూడని ప్రదేశాలను చూపిస్తూ ఆమెను కూడా తన ప్రేమలో పడేసేలా చేసుకుంటాడు. స్వతహాగా డాక్టర్ అయిన లీలా, వరుణ్ చెప్పిన ప్రతి విషయానికి వాదిస్తుంటుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా వారిద్దరి మధ్య గొడవలు అవుతుంటాయి. కడుపులో పెరుగుతున్న బిడ్డ వద్దని చెప్పడంతో అతనికి దూరమవుతుంది లీలా. ఈ గ్యాప్ లో ఒక యుద్ధ వాతావరణంలో  పాకిస్థాన్ జైల్ కు వెళ్తాడు వరుణ్. అక్కడి నుండి తప్పించుకుని మళ్లీ తన తప్పు తను తెలుసుకుని లీలా కోసం వెతికి ఆమెను చేరుకుంటాడు. వరుణ్ లీలా విడిపోడానికి కారణాలు ఏంటి..? వరుణ్ ను పాకిస్థాన్ జైల్ లో ఎందుకు వేస్తారు..? వరుణ్ లీలాలు కలిశారా లేదా అన్నది అసలు కథ.  

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

వరుణ్ గా కార్తి అదరగొట్టేశాడు. క్యారక్టరైజేషన్ మార్క్ యాటిట్యూడ్ చూపిస్తూ మరో పక్క ప్రేమ చూపించే సమయంలో కార్తి చాలా మెచ్యురెడ్ గా పర్ఫార్మెన్స్ చేశాడు. కచ్చితంగా ఈ సినిమాలో సరి కొత్త కార్తిని చూడొచ్చు. ఇక మణిరత్నం సినిమాలో హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదితి రావు హైదరి అందరి మనసులను దోచేసీంది. అదితిరావ్ హైదరి ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి మంచి ఎంట్రీ ఇచ్చిందనే చెప్పాలి.  ఒకానొక సందర్భంలో మణిరత్నం చూపించినట్టు హీరోయిన్స్ ను ఎవరు చూపించరేమో అన్న ఆలోచన రాకమానదు. వరుణ్, లీలా క్యారక్టర్స్ లో కార్తి, అదితి రావు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. వారి పెయిర్ కూడా చాలా బాగుంది. ఇక సినిమాలో మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించారు. 

సాంకేతిక వర్గం :

ఈ  సినిమాతో మణిరత్నం మరోసారి తన మార్క్ చూపించుకున్నాడు. ప్రతి ఫ్రేం ఎంతో నీట్ గా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా లొకేషన్స్ విషయంలో సినిమా కన్నుల పండుగగా ఉంటుంది. మణిరత్నం తన మార్క్ చూపించడంలో ఎక్కడ తగ్గలేదు. అయితే కథ కథనాల్లో క్లారిటీ ఇంకా చెప్పాలంటే కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది. రెహమాన్ మ్యూజిక్ పరవా లేదు కాకపోతే మునుపటిలా పాటలు గుర్తు ఉండేలా లేవు.  ముఖ్యంగా బ్యాక్ గ్రొండ్ స్కోర్ బాగా వచ్చింది. ఎడిటింగ్ ఓకే కాని సెకండ్ హాఫ్ ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ వరకు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా ఉన్నాయి. 

విశ్లేషణ :

ఈ ‘చెలియా’ చిత్రం ఖచ్చితంగా మిశ్రమ స్పందన తెచ్చుకునే చిత్రమే. కొందరు ప్రేక్షకులు మణిరత్నం యొక్క రొమాంటిక్ డ్రామా, టేకింగ్ ను ఇష్టపడితే ఇంకొందరు ప్రేక్షకులకు ఆ సీరియస్ రొమాంటిక్ డ్రామాను ఎంజాయ్ చేయడం కష్టంగా ఉంటుంది. కార్తి, అదితిరావ్ హైదరిల మధ్య కెమిస్ట్రీ, ఎంటర్టైనింగా ఉండే ఫస్టాఫ్ ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా నెమ్మదిగా సాగుతూ సాగదీయబడినట్టు ఉండే సెకండాఫ్ ప్రధాన బలహీనత. సహజంగా మణిరత్నం సినిమా అనగానే సిని ప్రియులంతా తన మార్క్ సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే అంచనాలకు తగ్గట్టు చెలియా అలానే దించేశాడు. కమర్షియల్ ఇమేజ్ ఉన్న కార్తిని ఓ లవర్ బోయ్ గా చూపించారు. యాటిట్యూడ్ మెయిన్ రీజన్ తో చూపించిన కార్తి క్యారక్ట్రైజేషన్ బాగా పండింది. హీరోయిన్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.  సినిమా మొదటి భాగం మంచి ప్రేమ కథగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో వారి మధ్య గొడవలను సరిగా చూపించలేకపోయాడు. ఇక సెకండ్ హాఫ్ ల్యాగ్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా నడిపించారు.

మాస్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమాలు చూసే ప్రేక్షకులు కచ్చితంగా ఈ సినిమా నచ్చే అవకాశం లేదు.  సినిమాలో చెప్పదలచుకున్న పాయింట్ సాగదీసినట్టు అనిపిస్తుంది. రొటీన్ కథే అయినా మణిరత్నం మార్క్ తో మొదటి భాగం కాస్త పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ ఆర్మికి హీరో చిక్కడం అక్కడ నుండి పారిపోయి ఇండియాకు రావడం లాంటివి కాస్త నమ్మేలా ఉండవు. మనసుకి హత్తుకునే ప్రేమకథే అయినా మధ్యలో నేరేషన్ స్లో అవడం వల్ల సినిమా అటు ఇటుగా అయ్యింది. మణిరత్నం సినిమాలు నచ్చే వారికి ఈ సినిమా నచ్చొచ్చు. మణి మిగతా సినిమాల కన్నా ఈ సినిమా మరి స్లోగా అనిపిస్తుంది. సరదాగా ఓసారి ప్రేమ అనుభూతిని పొందుదామని అనుకునే వారికి ఓకే కాని కచ్చితంగా మనసుకి నచ్చే సినిమా అవుతుందని మాత్రం చెప్పలేం.