రివ్యూ: జూ.ఎన్.టి.ఆర్ నటనా విశ్వరూపం 'జై లవ కుశ'

రివ్యూ: జూ.ఎన్.టి.ఆర్ నటనా విశ్వరూపం 'జై లవ కుశ'

21-09-2017

రివ్యూ: జూ.ఎన్.టి.ఆర్ నటనా విశ్వరూపం  'జై లవ కుశ'

తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ : 3/5

బ్యానర్ : యన్టీఆర్ ఆర్ట్స్ 
నటి నటులు :  జూ.ఎన్.టి.ఆర్, నవనీత థామోస్, రాశి ఖన్నా, రోనిత్ రాయ్, నందిత రాజ్,హంస నందిని, ప్రియదర్శిని పుల్లికొండ, అభిమన్యు సింగ్, హరీష్ ఉత్తమన్, స్పెషల్ అప్పీరెన్స్ తమన్నా భాటియా తది తరులు 

సినిమాటోగ్రఫీ : చోట కె నాయుడు
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర్ రావు, తమ్మి రాజు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, పాటలు : చంద్రబోస్, రామ జోగయ్య శాస్ట్రీ, 
మాటలు : కోన వెంకట్, కె .చక్రవర్తి
నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్
కథ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం : కె.యస్.రవీంద్ర (బాబీ)

విడుదల తేదీ :21.09.2017  

 

నందమూరి సోదరులు  కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన అన్నతమ్ములు కథ  ‘జై లవ కుశ’ ఈ సినిమా పై  అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్  తొలిసారి త్రిపాత్రాభినయం చేయడం, టీజర్స్, ట్రైలర్, పాటలు అన్నీ ఆకట్టుకోవడంతో తార స్థాయి క్రేజ్ నెలకొంది. మరి ఇన్ని అంచనాల నడుమ దసరా నవరాత్రుల సందర్భంగా ఈ రోజు  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లో తెలుసుకుందాం. 

కథ :

జై, లవ, కుశ ముగ్గురు కవలలు.. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన వీరు మేనమామ దగ్గర పెరుగుతారు. అనుకోకుండా ఓ ఫైర్ యాక్సిడెంట్ లో వారు ఇరుక్కుపోతారు. దాని నుండి ముగ్గురు సురక్షితంగా బయట పడినా ఎవరికి వారు మిగతా ఇద్దరు చనిపోయారని ఫిక్స్ అవుతారు. ఇక పెరిగిన వారిలో చిన్న వాడైన లవుడు  బ్యాంక్ మేనేజర్ అవుతాడు. కుశుడు యూఎస్ వెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటాడు. పాతిక లక్షలు సంపాదించే క్రమంలో ఉన్న కుశుడు ఎలాగోలా ఇమిగ్రేషన్ కోసం ఆ మొత్తాన్ని ఏర్పాటు చేయగా నోట్ల రద్దు వల్ల ప్లాన్ అంతా చెడిపోతుంది. ఇక దానితో డిస్ట్రబ్ అయిన కుశుడు తాగి రోడ్డు మీద వస్తుంటాడు.

అదే టైంలో కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన లవుడు అనుకోకుండా కుశుడిని గుద్దేస్తాడు. ఇక ఇద్దరు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మాట్లాడుతారు. ఇక అమాయకుడైన కుశుడు బ్యాంక్ లో తనకు జరుగుతున్న అవమానం గురించి కుశతో షేర్ చేసుకుంటాడు. ఇక అదే టైంలో లవుడుగా కుశుడు  బ్యాంక్ లోకి వెళ్తాడు. ఇక మరో పక్క జోధ్ పూర్ లో జై రాజకీయ నేతగా ఎదగాలనుకుంటాడు. అతనికున్న నత్తి వల్ల స్పీచ్ లు ఇవ్వలేడు. ఇక తన గ్రూప్ లో వ్యక్తి చనిపోవడం వల్ల అక్కడకు వెళ్లి నివేథను చూసి ఇష్టపడతాడు. ఇక అక్కడ నుండి కథ కొత్త టర్న్ తీసుకుంటుంది. ఇక లావుడి బ్యాంక్ లో పాతిక లక్షలు చోరికి గురవుతాయి. అది చేసింది కుశుడు అని అనుకుంటారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరిని కిడ్నాప్ చేస్తారు. అసలు జై పొందాలనుకున్న గుర్తింపు ఏమిటి ? లవ, కుశలను తన దగ్గరకు ఎందుకు రప్పించుకున్నాడు ?  ఇంతకీ జై లవ కుశ కలిశారా..? జై పాలిటిక్స్ లోకి వెళ్లాడా..? కుశుడు నిజంగానే 25 లక్షలు దొంగిలించాడా ఈ ముగ్గురు అన్నదమ్ములు ఏం చేశారు అన్నదే మిగతా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

ఎన్.టి.ఆర్ ఈ మూడు అక్షరాలు చాలు ఈ సినిమాకు అనిపిస్తుంది. జై లవ కుశగా ఎన్.టి.ఆర్ చూపించిన అభినయం వేలెత్తి చూపించేందుకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. ఒక పాత్రకు మరో పాత్రకు ఎన్.టి.ఆర్ చూపించిన వ్యత్యాసం అదరహో అనిపిస్తుంది. సినిమాకు ప్రధాన బలం ఎన్.టి.ఆర్ నటనే. మూడు పాత్రల్లోను ఆయన నటించిన తీరు అద్బుతమనే చెప్పాలి. వేషం, భాష, వ్యక్తిత్వం చివరికి శరీరం కదిలే వేగంలో కూడా మూడు పాత్రల్లోనూ మూడు విధాలుగా పెర్ఫార్మ్ చేసి స్పష్టమైన తేడా కనబడేలా నటించాడాయన. ఇదే కథలో ఆయన గనుక లేకపోతే సినిమా మొత్తం  కలగాపులగంగా మారి సినిమా మొత్తం తలకిందులయ్యేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి టిపికల్ వేరియేషన్స్ ను ఎన్.టి.ఆర్ తన నటనతో అరటిపండు వలచినంత స్పష్టంగా కళ్ళ ముందు ఆవిష్కరించాడు. కొన్ని సన్నివేశాల్లో ముగ్గురూ ఒకేలా ఉన్నా కేవలం ఎన్టీఆర్ ఆహార్యాన్ని బట్టే ముగ్గురిలో ఎవరు ఎవరో చెప్పేయవచ్చు. అంత పర్ఫెక్షన్ చూపించాడు ఎన్.టి.ఆర్. కేవలం అభిమానులకే కాక అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎన్.టి.ఆర్ నటన నచ్చుతుంది. సినిమా రిపీట్ ఆడియన్స్ ఉంటే అది కేవలం ఎన్.టి.ఆర్ కోసమే అని చెప్పొచ్చు. రాశీఖన్నా కొంత ప్రాముఖ్యత ఉన్న పాత్రలో అందంగా కనిపిస్తూ మెప్పించింది. మిగతా వారు తమ పాత్రల మేర నటించారు. 

సాంకేతిక వర్గం పని తీరు :

దర్శకుడు బాబీ విషయానికొస్తే ఆయన రాసుకున్న లైన్, కొంత కథనం బాగానే ఉన్నాయి. జై తో పాటు కొంచెం చిలిపితనం కలిగిన కుశ, బెరుకుతనం, నిజాయితీ ఉన్న లవ కుమార్ పాత్రల్ని కూడా బాగానే రాసుకున్నాడు. మూడింటిలో వేటికీ అన్యాయం జరగకుండా చూసుకున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఎలాంటి సినిమా కావాలనుకున్నాడో అదే ఈ జై లవకుశ. కథ కథనాల్లో దర్శకుడు బాబి చూపించిన పనితనం అంతా ఇంతా కాదు. ఎన్.టి.ఆర్ లోని నటనకు పరిపూర్ణత తెచ్చేలా మూడు పాత్రలు వేటికవి పోటీ పడేలా చేశాడు. ఇక మొదటి భాగం లవ, కుశల పాత్రలతో ఎంటర్టైన్ చేసిన బాబి సెకండ్ హాఫ్ లో జై పాత్రతో పీక్ లోకి తీసుకెళ్లాడు. జై పాత్ర వచ్చినప్పటి నుండి సినిమా మరో రేంజ్ కు వెళ్తుంది. ముఖ్యంగా ఆ పాత్రకు నత్తి ఉండటం ఆ పరిస్థితుల్లో ఎన్.టి.ఆర్ భారీ డైలాగులు కొట్టడం అబ్బో ఇంతకుమించి ఏం కావాలి అన్నట్టు అనిపిస్తుంది. ఇక ఎంటర్టైన్మెంట్, ట్విస్టులు అన్ని కలగలిపి సినిమా ఫుల్ మీల్స్ ప్యాక్ గా తీసుకువచ్చాడు బాబి.

సినిమా కోసం కోనా స్క్రీన్ ప్లే బాగా వర్క్ అవుట్ అయ్యిందని చెప్పాలి. కోన వెంకట్, చక్రవర్తిలు రాసిన కథనంలో పెద్దగా కొత్తదనం, ఆసక్తి లేకపోవడంతో ప్రేక్షకుడికి పూర్తి స్థాయి సంతృప్తి కలగలేదు. ఛోటా కె నాయుడి సినిమాటోగ్రఫీ బాగుంది. జై కోటను, అతని ఊరు భైరాంపూర్ బాగా చూపించారు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ను మూడు విధాలుగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసి ప్రేక్షకులకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేశారు. అలాగే ముగ్గురు కలిసి కబడే ఫ్రేమ్స్ ను సైతం బాగానే హ్యాండిల్ చేశారు. దేవిశ్రీ ఎప్పటిలాగే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించగా, రావణ అనే పాత మినహా మిగతాయి సో సో గా వున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగానే ఉంది. నిర్మాతగా కళ్యాణ్ రామ్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి.

విశ్లేషణ :

కథ కథనాలే కాదు ఎన్.టి.ఆర్ ప్రెజెన్స్ సినిమాకు బీభత్సమైన క్రేజ్ తెస్తుంది. మూడు పాత్రలతో ఎన్.టి.ఆర్ సినిమా మొత్తం తన భుజాన వేసుకుని నడిపించాడు.  మొత్తానికి సినిమా మీద ఏదైతే నమ్మకం ఉంచారో అదే తరహాలో ఆడియెన్స్ ను ముఖ్యంగా ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు ఈ సినిమా పండుగ వాతావరణం  తెచ్చేసిందని చెప్పాలి. ‘జై లవ కుశ’ ఎన్టీఆర్ సోలో పెర్ఫార్మెన్స్ మీద నడిచ చిత్రమని చెప్పొచ్చు. మూడు పాత్రల్లో ఆయన నటించిన విధానం ముఖ్యంగా జై పాత్రలో ఆయన నెగెటివ్ నటన అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. కొత్త లైన్, కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలు, సెకండాఫ్లో ఎలివేట్ అయ్యే అన్నదమ్ముల సెటిమెంట్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా పెద్దగా కొత్తదనం, ఆసక్తి లేని కథనం, రొటీన్ ఎండింగ్ కొంత నిరుత్సాహానికి గురిచేసే అంశాలు. ఇక హీరోయిన్స్ అందాలు సినిమాకు అదనపు ఆకర్షణలు. మొత్తం మీద ఎన్టీఆర్ అద్భుత నటనతో ఈ చిత్రం అభిమానులని అలరించేలా ఉన్నా రెగ్యులర్ ప్రేక్షకులకు ఒకే అనిపిస్తుంది.