'రోగ్' పూరి మార్క్ మూవీ

'రోగ్' పూరి మార్క్ మూవీ

31-03-2017

'రోగ్' పూరి మార్క్ మూవీ

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 2.5/5

బ్యానర్ : తన్వి ఫిలిమ్స్,
నటీనటులు : ఇషాన్ (తొలి పరిచయం), మన్నారా చోప్రా,ఏంజెలా క్రిస్లఇంజకి, ఠాకూర్ అనూప్ సింగ్,
అజిజ్ ఖాన్, అవినాష్, అలీ, తులసి శివమణి, సుబ్బరాజు, చిరాగ్ జానీ తది తరులు...

సినిమాతో గ్రఫీ : ముకేశ్.జి, ఎడిటింగ్ : జునైద్  సిద్దిక్వి, సంగీతం : సునీల్ కశ్యప్,
పాటలు : భాస్కరభట్ల రవి కుమార్, నిర్మాతలు : సి ఆర్ మనోహర్, సి ఆర్ గోపి,

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పూరి జగన్నాధ్

విడుదల తేదీ : 31.03.2017

 

దర్శకుడు పూరి జగన్నాథ్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక, గతం లో తన స్టయిల్లో తీసిన సూపర్ హిట్  ఇడియట్ కి కొనసాగింపు  వంటి చిత్రం  ‘రోగ్’. (మరో చంటిగాడి ప్రేమ కథ ) న్యూ హీరో  ఇషాన్  ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. నిర్మాత సి ఆర్ మనోహర్,సి ఆర్ గోపి లు నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయ్యింది.  మరి పూరి ప్రయత్నం ఏ విధంగా ఉందొ  ఇప్పుడు చూద్దాం..

కథ :

పోకిరిగా తిరిగే హీరో చంటి  (ఇషాన్).. కమీషనర్ చెల్లి అంజలి  (ఎంజెలా)ను ప్రేమిస్తాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ సుబ్బరాజుకి ఇచ్చి చెల్లి ఎంగేజ్ మెంట్ ప్లాన్ చేస్తాడు కమీషనర్. అక్కడకి  హీరో వెళ్లి గొడవ చేస్తాడు.ఇషాన్ ఆవేశం లో ఒక పోలీసాఫీసర్  రెండు కాళ్లు విరిగేలా కొడతాడు. ఆ గొడవలో ఓ పోలీస్ కుటుంబం రోడ్డున పడుతుంది.  అందుకే ఆ కుటుంబానికి ఆసరగా నిలబడాలని అనుకుంటాడు. జైల్లో ఉన్న హీరోని చూసేందుకు వచ్చిన అంజలి తన ప్రేమ అంతా నటన అని చెబుతుంది. అప్పటి నుండి ఆడవాళ్ల మీద అసహ్యం పెంచుకుంటాడు ఇషాన్. ఇక ఆసరగా ఉన్న కానిస్టేబుల్ కు ఓ చెల్లి ఉంటుంది. ఆమె పేరు కూడా  అంజలి (మన్నారా చోప్రా) ఆమెను ఓ సైకో (అనూప్ సింగ్ టాకూర్) వెంటాడుతుంటాడు. పోలీసులు ఆ సైకో కోసం వెతుకుతారు అసలు ఆ సైకోకి ఈ  అంజలి సంబంధం ఏంటి..? ఎందుకు అంజలి కోసం ఆ సైకో వస్తాడు..? హీరో ఆ సైకోని ఎలా ఎదుర్కున్నాడు..? అంజలి ఇషాన్ ను నిజమ్ గా ప్రేమించిందా అబద్ధం చెప్పిందా?  ఈ విషయాలన్నీ వివరణ ఇచ్చింది మిగతా కథ లో.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

హీరో గా తొలిపరిచయమే అయినా ఇషాన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఓ మాస్ హీరోకి ఉండాల్సిన లక్షణాలన్ని ఉన్నాయి. అయితే క్యారక్టరైజేషన్ విషయంలో ఇంకాస్త పరిణితితో చేయాల్సి ఉంది. మొదటి సినిమాకు ఈ మాత్రం చేశాడంటే గొప్ప విషయమే. ఇక హీరోయిన్స్ ఎంజెలా కొద్దిసేపే అయినా అలరించింది. ఇక మన్నారా చోప్రా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పూరి టేకింగ్ లో హీరోయిన్స్ డిఫరెంట్ గా కనిపిస్తారు. మన్నారా చోప్రా ఇదవరకు రెండు సినిమాలు చేసినా ఈ సినిమాలో చాలా అందంగా అనిపిస్తుంది. ఇక ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా సుబ్బరాజు ఆకట్టుకున్నాడు. సైకో పాత్రలో అనూప్ సింగ్ ఠాకూర్ ఇంప్రెస్ చేశాడు. తన పాత్రకు తాను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. 

సాంకేతికవర్గం: 

పూరి డైరక్షన్ లో వచ్చిన ఈ రోగ్ మరోసారి తన రొటీన్ కమర్షియల్ ఫార్మెట్ లో సాగింది. కథ కథనాలేవి ఆడియెన్స్ కు ఇన్వాల్వ్ అయ్యేలా చేయవు. వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి ఈ రోగ్ తో కూడా ఏ మాత్రం  ఆకట్టుకోలేకపోయాడు. పూరి మార్క్ సినిమా అంటే కచ్చితంగా కమర్షియల్ అంశాలు ఉండాల్సిందే. అదే క్రమంలో వచ్చిన రోగ్ కూడా పక్కా పూరి మార్క్ సినిమాగా ఉంటుంది. కథ కథనాల్లో మాత్రం రొటీన్ పంధానే కొనసాగించాడు పూరి. మొదటి భాగం కాస్త రేసీగా ఉన్నట్టు అనిపించినా సెకండ్ హాఫ్ బోర్ కొట్టించేశాడు. సినిమా స్టైలిష్ గా, అందంగా  తీయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. పూరి స్టైల్లో ఉండే డైలాగులు హీరో ఇషాన్ కు చాలా బాగా యాప్ట్ అయ్యాయి.  ఇక సునీల్ కశ్యప్ సంగీతం యావరేజ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.  

విశ్లేషణ :

అసలే కొత్త హీరో కాని ఆ హీరో ఇమేజ్ కు మించిన క్యారక్టరైజేషన్ అనిపిస్తుంది. పరిచయం లేని ఫేస్ కాబట్టి కాస్త ఇబ్బంది పడతారు. పాటలు, ఫైట్స్ అన్ని తన గత సినిమాల్లానే రచ్చ చేసేశాడు పూరి. కాని మరోసారి పదునైన కథ చెప్పడంలో మాత్రం విఫలమయ్యాడు. హీరో క్యారక్టరైజేషన్ బిల్డప్ షాట్స్ మీద పెట్టిన దృష్టి కథ మీద పెట్టి ఉంటే బాగుండేది.  సిటీలో పోలీసులు అంతా ఉండగా అంజలి అన్న పేరు మీద చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాల్ల దాకా కిడ్నాప్ అవుతుంటే పోలీసులు చూస్తూ ఉండటం పెద్ద కామెడీగా ఉంటుంది. అసలు పూరి దృష్టిలో పోలీసులు మరి అంత కామెడీగా కనిపించడం ఏంటో అర్ధం కాదు. ఇక ఆలితో చేయించిన బెగ్గింగ్ కామెడీ కూడా కొత్తగా ఏమి అనిపించదు. ఓవరాల్ గా పూరి రోగ్ మరోసారి పూరి పాత సినిమాలను చూసినట్టే ఉంటుంది. హీరో పోకిరిగా ఉండటం అది చూసి హీరోయిన్ ఇష్టపడటం ఇదంతా తన గత సినిమాల పద్ధతిలోనే చాలా చూపించాడు. పూరి డైరక్షన్ టేకింగ్ నచ్చే ప్రేక్షకులు ఓసారి చూస్తారేమో కాని సగటు ప్రేక్షకుడు పెదవి విరిచేయడం ఖాయం.