రివ్యూ : 'యుద్ధం శరణం' వ్యూహం శూన్యం

రివ్యూ : 'యుద్ధం శరణం' వ్యూహం శూన్యం

08-09-2017

రివ్యూ : 'యుద్ధం శరణం' వ్యూహం శూన్యం

తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ 2.5/5

బ్యానర్ : వారాహి చలన చిత్రం 
నటీనటులు : నాగ చైతన్య, శ్రీ కాంత్, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, రేవతి, మురళి శర్మ, ప్రియదర్శిని పుల్లికొండ, రవి వర్మ తదితరులు...

సినిమాటోగ్రఫీ :నికేత్  బొమ్మిరెడ్డి, ఎడిటర్ : కృపాకరం
సంగీతం : వివేక్ సాగర్, పాటలు : శ్రేష్ఠ, కిట్టు విస్సాప్రగడ, ప్రణవ్ చాగంటి
కథ : డేవిడ్ ఆర్ నాథన్, మాటలు : అబ్బూరి రవి
నిర్మాత : సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కృష్ణ మారిముత్తు

విడుదల తేదీ :08.09.2017

 

వారాహి చలనచిత్రం అంటే తెలుగు ఇండస్ట్రీలో మంచి సినిమాలను అందించే సంస్థగా మంచి గుర్తింపు ఉంది. అలాగే 'రారండోయ్ వేడుక చూద్దాం' వంటి హిట్ చిత్రం తరువాట్గ్  నాగ చైతన్య  తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకొని ముందుకుపోతున్నాడు. మరో వైపు శ్రీకాంత్ చాలా ఏళ్ల తర్వాత హీరో నుంచి విలన్ గా టర్న్ తీసుకొని చేసిన చిత్రం ‘యుద్ధం శరణం’. మరి ఇన్ని ప్రత్యేకతల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం....

కథ :

అర్జున్(నాగ చైతన్య) కు తన అమ్మ సీత(రేవతి), నాన్న మురళీ కృష్ణ(రావు రమేష్), ప్రియురాలు అంజలి(లావణ్య త్రిపాఠి) అక్క, భావ, చెల్లి ప్రపంచం. తన ప్రపంచంలో ప్రేమించిన అమ్మాయితో, ప్రేమని పంచె అమ్మ నాన్నలతో సంతోషంగా ఉంటూ మరో వైపు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తనకంటూ ఓ డ్రోన్ తయారు చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతనిది ఒక హ్యాపీ ఫ్యామిలీ.తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్ వృత్తి చేస్తుండటంతో స్వచ్చంద్ర సేవ చేస్తుంటారు. అలాంటి తన జీవితంలో అనుకోకుండా అర్జున్ అమ్మ, ఈ క్రమంలో అర్జున్ తన తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోయారని తెలుస్తుంది. అయితే వారి చావుకి నాయక్(శ్రీకాంత్) అనే ఒక రౌడీ కారణం అని అర్జున్ కి తెలుస్తుంది. అయితే నాయక్, అర్జున్ అమ్మ, నాన్నని ఎందుకు చంపాడు? ఆ విషయం అర్జున్ కి ఎలా తెలుస్తుంది? ఇంతకీ అర్జున్ పేరెంట్స్ ను ఎందుకు చంపారు..? తన అమ్మ, నాన్న చావుకి కారణం అయిన నాయక్ మీద అర్జున్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది సినిమా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:

నాగ చైతన్య పాత్ర చూసుకుంటే సింపుల్ అండ్ స్వీట్ లైఫ్ తో హ్యాపీగా వెళ్ళిపోయే యువకుడుగా, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి చావుకి కారణం అయిన వాడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి, తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి అతనితో యుద్ధం చేయడానికి సిద్ధమైన కొడుకుగా రెండు రకాల ఎమోషన్స్ ని బాగా చూపించాడు. ఇక చాలా ఏళ్ల తర్వాత శ్రీకాంత్ చేసిన విలన్ పాత్ర సినిమాలో మేజర్ హైలెట్. అతను తన కళ్ళతో విలనిజాన్ని చూపిస్తూ చేసిన నాయక్ పాత్ర ఆకట్టుకుంది. ఇక హీరోయిన్ గా లావణ్య పర్వాలేదనిపించుకుంది. ఇక సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా మురళీ శర్మ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు కూడా ఎవరి పాత్ర పరిధి మేరకు వారు భాగానే చేశారు.

సాంకేతిక వర్గం పని తీరు :

యుద్ధం శరణం టెక్నికల్ టీం విషయానికొస్తే దర్శకుడు కృష్ణ కథ పాతదే రాసుకున్నా దానికి కథనం కొత్తగా ట్రై చేశాడు. కాని సినిమా చెప్పడంలో మాత్రం కన్ ఫ్యూజ్ చేశాడు. ఎక్కడ హీరోయిజం ఎలివేట్ అవ్వలేదు. అయితే దర్శకుడు కృష్ణ ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషన్స్ మీద నడిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ కంటే ఇంటలిజెన్స్ ముఖ్యం. అందులో దర్శకుడు సరైన పనితనం చూపించలేకపోయారు. ఒక పెద్ద రౌడీ, ఒక మామూలు కుర్రాడు మధ్య కథ నడిపించే ఇంటెలిజెంట్ గేమ్ చాలా ఇంటెన్సిటీతో ఉండాలని ఆడియన్స్ కోరుకుంటారు. అందులో దర్శకుడు అనుభవలేమి కొట్టోచ్చినట్లు కనిపిస్తుంది.అంతేకాదు సినిమాలో విలన్ పాత్రని సరిగా తీర్చిద్దలేదు. ఇక సంగీతం వివేక్ సాగర్ పర్వాలేదు సాంగ్స్ ఏమో కాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది. వారాహి చలన చిత్ర ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

విశ్లేషణ :

లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న నాగ చైతన్య మాస్ ఇమేజ్ కోసం చేసే ప్రయత్నంలో యుద్ధం శరణంతో వచ్చాడు. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కథ ఎప్పటిలానే తల్లిదండ్రులను చంపడానికి కారణమైన విలన్ ను చంపడమే. అయితే ఇదే కథను కాస్త స్క్రీన్ ప్లే తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా కన్ ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టాడు.

ఎమోషనల్ వేలో సాగించిన ఈ సినిమా కథనం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఎంటర్టైన్మెంట్ పాళ్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కథ కూడా కొత్తగా ఏమి అనిపించదు. ఇక విలన్ గా శ్రీకాంత్ లాంటి అనుభవమున్న స్టార్ ను పెట్టుకుని ఆయన్ను సరిగా వాడుకోలేదు. కథ కథనాల విషయంలో దర్శకుడు ఏమాత్రం సక్సెస్ కాలేదు. ఇక ప్రతి ఒక్క సీన్ ప్రేక్షకులు ఊహించేలా రావడం కూడా ఆకట్టుకునేలా ఉండదు. కథనం మాత్రమే చెప్పి చైతుని ఇంప్రెస్ చేసి ఉండొచ్చేమో కాని దాన్ని తెరమీద చూపించిన విధానం మాత్రం సోసోగానే సాగింది. సినిమా ఓవరాల్ గా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయడంలో విఫలమైందని చెప్పొచ్చు.