నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం 'ఎన్టీఆర్ కథానాయకుడు'

నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం 'ఎన్టీఆర్ కథానాయకుడు'

09-01-2019

నందమూరి బాలకృష్ణ  నట విశ్వరూపం 'ఎన్టీఆర్ కథానాయకుడు'

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5

బ్యానెర్లు : ఎన్ బి కె ఫిలిం, వారాహీ చలన చిత్ర, మరియు వైబ్రి మీడియా

నటి నటులు ఏ పాత్రలు  పోషిస్తున్నారో చూద్దాం నందమూరి తారక రామారావు : బాలకృష్ణ, శ్రీమతి నందమూరి బసవ రామ తారకం : విద్యా బాలన్, నందమూరి త్రివిక్రమరావు : దగ్గుబాటి రాజా, నందమూరి హరికృష్ణ : కల్యాణ్ రామ్, లోకేశ్వరి : పూనమ్ బజ్వా, భువనేశ్వరి : మంజిమా మోహన్, సాయి కృష్ణ : గారపాటి శ్రీనివాస్, పురంధేశ్వరి : హిమన్సీ, ఉమా మహేశ్వరి : హీరోషిని కోమలి, నందమూరి రామకృష్ణ : రోహిత్ భరద్వాజ్, అక్కినేని నాగేశ్వరరావు : సుమంత్, రామోజీరావు : గిరీష్, ఎస్వీ రంగారావు, : ఈశ్వర్ బాబు, నారా చంద్రబాబు నాయుడు : దగ్గుబాటి రానా, మండలి వెంకట కృష్ణా రావు : మండలి బుధప్రసాద్, హెచ్ ఎం రెడ్డి : కైకాల సత్యనారాయణ,  దాసరి నారాయణ రావు : చంద్ర సిద్ధార్థ్, రేలంగి : బ్రహ్మానందం, నాగిరెడ్డి : ప్రకాష్ రాజ్ ఆలూరి చక్రపాణి  : మురళీ శర్మ, ఎల్వి ప్రసాద్ : జిషు సేనుగుప్త, శ్రీదేవి : రకుల్ ప్రీత్ సింగ్, నాదెండ్ల భాస్కరరావు : సచిన్ ఖేదేకర్, బి ఏ సుబ్బారావు : నరేష్, పీ పుల్లయ్య : శుభలేఖ సుధాకర్, కే వీ రెడ్డి :  క్రిష్ జాగర్లమూడి, పీతాంబరం : సాయి మాధవ్ బుర్రా,  బి విఠలాచార్య : ఎన్ శంకర్, కృష్ణ కుమారి : ప్రణీత శుభాస్, వెంపటి చిన సత్యం : శివ శంకర మాస్టర్, సావిత్రి : నిత్యామీనన్, జయప్రద : హన్సిక మోత్వాని, ప్రభ : శ్రీయ, జయసుధ : పాయల్ రాజపుత్, యోగానంద్ : రవిప్రకాష్,  తాతినేని ప్రకాష్ రావు : ఇంటూరి వాసు, టీ వెంకటరాజు : సురభి జయ చంద్ర,  పేకేటి శివరాం : భద్రం, షావుకారు జానకి : షాలిని పాండే, పింగళి : సంజయ్, మార్కస్ బార్ట్లే : అర్జున ప్రసాద్,  గుమ్మడి : దేవీ ప్రసాద్, జీ వరలక్ష్మీ : ప్రత్యూష, పుండరీకాక్షయ్య : నాగేశ్వరరావు, కమలాకర్ కామేశ్వర రావు : ఎస్వీ కృష్ణారెడ్డి, ఇందిరాగాంధీ : సుప్రియా వినోద్,  సీ నారాయణరెడ్డి : రామజోగయ్య, శాస్ట్రీ,  ఎమ్ జి రామచంద్రన్ : సికిందర్, కన్నప్ప : సునీల్ కుమార్ రెడ్డి, డీ వీ నరసరాజు : శ్రీనివాస్ అవసరాల, కె రాఘవేంద్రరావు : కె ప్రకాష్, సలీం మాస్టర్ : రఘు మాస్టర్, దగ్గుపాటి వెంకటేశ్వరరావు : భరత్ రెడ్డి, చల్మేశ్వర్ రావు : నాగరాజ్, రూఖ్మాంగధ రావు : వెన్నెల కిషోర్.


సంగీతం : కీరవాణి 
పాటలు: సిరివెన్నెల, కె శివ దత్త, డా.కె రామకృష్ణ, యం యం కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్ వి యస్; ఎడిటర్ : అర్రం రామకృష్ణ
మాటలు: సాయి మాధవ్ బుర్ర; కార్యనిర్వాహక నిర్మాత: యం ఆర్ వి ప్రసాద్
సహా నిర్మాతలు సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
నిర్మాతలు :నందమూరి వసుందర దేవి, నందమూరి బాలకృష్ణ 
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి

విడుదల తేదీ : జనవరి 09, 2019

మహనీయుల జీవిత చరిత్రలను సినీ మాధ్యమం ద్వారా ప్రజలకి అందచేస్తే ఎప్పుడు ఆదరిస్తారని గత బయోపిక్స్ చిత్రాలు నిరూపించాయి. మన జాతిపిత 'మహాత్మ గాంధీ' జీవిత చరిత్ర ఆధారంగా 1982 లో రిచర్డ్ అట్టెంబోరౌ రూపొందించిన 'గాంధీ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా ఆదరించారో తెలిసిందే. మన్యం వీరుడు 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో జీవించి  సూపర్ స్టార్ కృష్ణ  బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఆ విధంగా  బయోపిక్స్ కు వున్నా సక్సెస్ లు పరిశీలిస్తే ఎక్కువ శాతం విజయం సాధించిన చిత్రాలే  వున్నాయి. టాప్ త్రి హిట్  మూవీస్ లో మహానటి సావిత్రి జీవిత చరిత్ర పై తీసిన 'మహానటి' చిత్రం, గతంలో రాంగోపాల్ వర్మ అందించిన  'రక్త చరిత్ర 1, 2 మరియు 'వంగవీటి' చిత్రాలు ఎంతగా సక్సెస్ పొందాయో తెలిసిందే. మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ్ చిత్రం యం జి ఆర్ జీవిత చరిత్ర  'ఇరువురు' కూడా అక్కడి ప్రజలు ఆదరించారు.  తెలుగు, తమిళ్ లో  కంటే హిందీ లో మరింత గా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలు చాలా వున్నాయి అగ్ర కుల వర్గ అత్యాచారానికి బలైన  పూలన్ దేవి కథతో 'బాండిట్ క్వీన్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జీవిత కథ 'ది ఫర్గాటెన్ హీరో' మొగల్ చక్రవర్తి కథతో  'జోదా అక్బర్',  క్రికెట్ ప్లేయర్స్  సచిన్, ధోని, అథ్లెటిక్ మిల్కా సింగ్, మేరీ కోమ్, అన్నా హజారే కథతో 'అన్నా' ఒలంపిక్ 1948 లో జరిగిన  హాకీ లో ఇండియా సాధించిన 'గోల్డ్' మెడల్ కథ,  కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫోగాట్ జీవిత కథ తో 'దంగల్'. సంజయ్ దత్ జీవితం లో జరిగిన ముఖ్యమైన ఘట్టాలతో 'సంజు' సిల్క్ స్మిత కథ తో 'డర్టీ పిక్చర్' ఇలా ఎన్నో చిత్రాలు సక్సెస్ ఖాతాలో వున్నాయి.

ఇక తాజాగా తెలుగులో నందమూరి తారక రామరావు జీవిత కథ ఆధారంగా 'ఎన్టీఆర్' కథానాయకుడు, మహానాయకుడు ఈ ఏడాది మచ్ అవైటెడ్ బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. తండ్రి పాత్రలో నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న మొదటి భాగం "ఎన్టీఆర్ కథానాయకుడు" జనవరి 9న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ముఖ్యంగా ఎన్టీఆర్‌ కు ఆయన భార్యతో ఉన్న అనుబంధం ఆమె మాటకు ఎంత విలువ ఇస్తారన్న విషయాలను చూపించారు. ఎన్టీఆర్‌ బాల్యానికి సంబంధించిన అంశాల జోలికి పోకుండా డైరెక్ట్‌గా సినీ జీవితంతో కథను మొదలుపెట్టాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న బసవ రామ తారకం(విద్యాబాలన్‌) పరిచయంతో సినిమా ప్రారంభమవుతుంది. ఆమె ఎన్టీఆర్ ఆల్బమ్‌ను చూస్తుండగా అసలు కథ స్టార్ట్‌ అవుతుంది.  ఎన్టీఆర్ (బాలకృష్ణ) బెజవాడ లో (ఇప్పటి విజయవాడ)  రిజిస్టారర్ గా పనిచేస్తూ వాళ్ళ డిపార్ట్మెంట్ లో వున్న అవినీతి నచ్చక ఉద్యోగానికి  రాజీనామా చేసి తనకున్న నాటక అనుభవంతో సినిమాల్లో కి వెళ్లాలనుకుంటాడు. తనకి హీరో గా  అవకాశం ఇస్తానన్న యల్ వి ప్రసాద్ ని మద్రాస్ లో కలుస్తాడు. అక్కడ కూడా  అవకాశం ఇస్తానన్న దర్శకులు నిర్మాతలు ఎనిమిది నెలలు తన సమయం వృధా చేసినందుకు బాధపడి వెనుతిరుగుతాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు సినిమాల్లో అవకాశాలు ఎలా వచ్చాయి ? ఇండియన్ మొదటి సూపర్ స్టార్ గా ఎలా ఎదిగారు ? ఆ తరువాత రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

నటీనటుల పెర్ఫార్మన్స్:

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం లో వన్ అండ్ ఓన్లీ గా బాలకృష్ణ నటన మేజర్ హైలైట్ అయ్యింది. ఆయన కెరీర్ లోనే  ఈ చిత్రం ఓ  మైలు రాయిగా నిలిచిపోతుంది. ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయిన తీరు చూస్తే ఈ పాత్రను బాలయ్య తప్ప ఎవరు చేయలేరని అనిపిస్తుంది. ఒక విధంగా ఎన్టీఆర్ లోకి పరకాయ ప్రవేశం చేసినట్లు స్క్రీన్ పై ఆ మహానటుని  ప్రత్యక్ష రూపం కనిపించింది. ఇక బాలకృష్ణ తో పాటు  నటన పరంగా మెప్పించిన పాత్రలు బసవతారకం గా విద్యాబాలన్, ఏయన్ఆర్ గా నటించిన సుమంత్, హరికృష్ణ గా నటించిన కళ్యాణ్ రామ్, నందమూరి త్రివిక్రమ రావు గా నటించిన దగ్గుబాటి రాజా, బి యన్ రెడ్డిగా క్రిస్స్ చాలా బాగా నటించారు. ముఖ్యంగా విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రకు కరెక్ట్ గా సరిపోయింది. 

సాంకేతిక వర్గం :

తెలుగు ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహా నటుడు ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కించడం సవాలు తో కూడుకున్న పని. ఈ విషయంలో క్రిష్ చాలా వరకు విజయం సాదించాడనే చెప్పొచ్చు. చెప్పాల్సిన విషయాలు క్లుప్తంగా చెపుతూ, చూపాల్సిన  కీలక ఘట్టాలను చూపిస్తూ.. ఎక్కడ బోర్ అనేది లేకుండా ప్రేక్షుకుడు  ఆద్యతం సీట్ కు అంటిపెట్టుకునేట్టు చేసాడు. గత చిత్రాలను పోల్చుకుంటే ఈ చిత్రం అయన కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ ఇదే అవుతుంది. ఇక కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలనాటి సంగీత వాయిద్యాలను వాడుకుంటూ ఫిఫ్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్ అండ్ ఎయిటీస్ లో సినిమాలకు అనుగుణంగా చాలా బాగుంది.  సినిమాటోగ్రఫీ కూడా ఒక హైలెట్ ఎందుకంటె అలనాటి ఎన్టీఆర్ ని, పరిసరాల్ని మన కళ్ళముందు ఉంచాలి దానికి పెరియాడికల్ గా చూపించాలి దానికి తగినట్టుగా అతని పనితీరు కూడా చాలా బాగుంది. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహిస్తే బాగుండేది. సాయి మాధవ్ బుర్ర రాసిన సంభాషణలకు కొన్ని చోట్ల క్లాప్స్ పడ్డాయి. ఇక ఎన్ బి కె ఫిలిమ్స్. వారాహి, విబ్రి మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

విశ్లేషణ :

మహా నటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు బాలకృష్ణ అభిమానులకే కాకుండా తెలుగు సినీ ప్రేక్షకులను చాలా వరకు మెప్పించింది. ఎన్టీఆర్ లాంటి మహానటుడి జీవిత కథను వెండితెర మీద ఆవిష్కరించే బృహత్తర బాధ్యతను తీసుకున్న దర్శకుడు క్రిష్‌, నందమూరి అభిమానులను దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించాడు. కథా కథనాల మీద కన్నా బాలయ్య అభిమానులను అలరించే ఎలివేషన్‌ షాట్స్‌ మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు. అయితే ఎన్టీఆర్ కథను తెలుసుకోవాలనుకున్న ప్రేక్షకులకు ఇదో పాఠ్య యంశం లాంటిది.  ముఖ్యంగా కృష్ణుడిగా ఎన్టీఆర్ తెరమీద కనిపించే సన్నివేశానికి థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుంది. ఎన్టీఆర్, బసవ రామ తారకం ల మధ్య వచ్చే సన్నివేశాలను తన స్టైల్‌లో ఎంతో ఎమోషనల్‌గా చూపించాడు. బాలయ్య హీరోగానే కాక నిర్మాతగాను మంచి మార్కులు సాధించారు. ఎన్టీఆర్ కథను అభిమానులకు అందించేందుకు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఖర్చు పెట్టారు.  బాలకృష్ణ నటన, సినిమాటిక్ ఎలివేషన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవ్వగా, చివరగా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు మంచి ఛాయస్ అవుతుందనే చెప్పవచ్చు. ఈ జనరేషన్ వారికి తప్పక చూడాల్సిన సినిమా ఇది.