ఎస్ బీఐ ఖాతాదారులకు శుభవార్త

ఎస్ బీఐ ఖాతాదారులకు శుభవార్త

13-03-2018

ఎస్ బీఐ ఖాతాదారులకు శుభవార్త

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు శుభవార్త. బ్యాంకు ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేనిపక్షంలో బ్యాంకు వసూలు చేసే ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఎస్‌బిఐ ప్రకటించింది. ఇప్పటి వరకు ఎవరి ఖాతాలో అయినా మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకపోతే నెలకు 50 రూపాయిల వరకూ ఛార్జీలను వసూలు చేసేది. తాజాగా ఈ ఛార్జీలను తగ్గించింది. నగరాల్లో నెలకు 50 రూపాయిలుగా ఉన్న ఛార్జీలను 15 రూపాయిలకు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 40 రూపాయిలుగా ఉన్న ఛార్జీలను పట్టణాల్లో 12 రూపాయిలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 రూపాయిలకు తగ్గించింది. బ్యాంకు ఖాతాదారులనుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఈ చార్జీలను తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ రిటైల్‌ అండ్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఎండి పి.కె. గుప్తా తెలిపారు.