కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాలు రద్దు

కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాలు రద్దు

13-03-2018

కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాలు రద్దు

శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ సర్కార్‌ సిసి పుటేజీలను పరిశీలించి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ శాసనసభ సభ్వత్వాలను రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంతేకాకుండా సీఎల్‌పీ నేత జానారెడ్డి సహా 11 మంది ఎమ్మెల్మేలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్‌రావు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఆమోదం తెలిపింది. శాసన మండలిలోనూ కాంగ్రెస్‌ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు.