ఆ రోజు కాంగ్రెస్ చేసిందే... ఇప్పుడు బీజేపీ చేస్తుంది

ఆ రోజు కాంగ్రెస్ చేసిందే... ఇప్పుడు బీజేపీ చేస్తుంది

08-03-2018

ఆ రోజు కాంగ్రెస్ చేసిందే... ఇప్పుడు బీజేపీ చేస్తుంది

రాజకీయ ప్రయోజనాల కన్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. శాసన సభలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారని, టీడీపీ హయాంలో మహిళలకు అనేక విధాలుగా సహకరిస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ పార్టీలు జాతీ ప్రయోజనాల కోసం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పద్ధతి లేకుండా విభజన చేస్తుంటే ఇది పద్ధతి కాదని జాతీయ పార్టీగా అప్పుడు బీజెపీ ఎందుకు చెప్పలేదని నిలదీశారు. విభజన సమయంలోని అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని బాబు గుర్తు చేశారు.

ఎపీకి న్యాయం జరగాలని బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, ఆరోజు కాంగ్రెస్‌ చేసిందే ఇప్పుడు బీజేపీ చేస్తుంటే జాతీయ పార్టీలపై నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యలు తనని బాధ కలిగించాయన్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, అన్యాయం జరిగిందనే గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారు. తనకు ఎవరిపైనా కోపం లేదని, ఏపీ ప్రజల మనోభావాలను జాతీయ నాయకులు గౌరవించాలన్నారు. అందరు ఐక్యంగా ఉండాల్సిన అవసరముందని అన్నారు. అవసరమైనపుడు బిజెపి రాష్ట్ర నాయకులు కూడా ఎపీ తరపున నిలబడలని, పార్టీ పరంగా రాజీనామా చేసినా న్యాయం కోసం ముందుండాలని పిలుపునిచ్చారు.