నాగాలాండ్ సీఎంగా రియో ప్రమాణ స్వీకారం

నాగాలాండ్ సీఎంగా రియో ప్రమాణ స్వీకారం

08-03-2018

నాగాలాండ్ సీఎంగా రియో ప్రమాణ స్వీకారం

నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా నేషనల్‌ డెమొక్రాటిక్‌ ప్రొగ్రెసివ్‌ పార్టీ (ఎన్డీపీపీ) నేత నైపు రియో ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రితో పాటు మరో 11 మంది మంత్రులతో గవర్నర్‌ పీబీ ఆచార్య ప్రమాణ స్వీకారం చేయించారు. నాగాలాండ్‌లో ఎన్నికైన కొత్త ప్రభుత్వం రాజ్‌భవన్‌కు వెలుపల ప్రమాణ స్వీకారం చేయడం ఇదే తొలిసారి. సాధారణంగా రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్లో వీవీఐపీలు, వీఐపీలు, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో మాత్రమే ఈ కార్యక్రమం జరిగేది. అయితే ఈసారి ప్రజలకు కనిపించే విధంగా కోహిమాలోని ఓ స్థానిక మైదానంలో ముఖ్యమంత్రి సహా మంత్రులు ప్రమాణం చేశారు. సామాన్య ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చే విధంగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ దినపత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది. కాగా ఇదే మైదానం నుంచి 1963 డిసెంబర్‌ 1న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధకృష్ణన్‌ నాగాలాండ్‌కు రాష్ట్ర హోదా ప్రకటించడం వివేషం.