సీఎం కేసీఆర్ కు ఎన్ ఆర్ ఐల మద్దతు

సీఎం కేసీఆర్ కు ఎన్ ఆర్ ఐల మద్దతు

08-03-2018

సీఎం కేసీఆర్ కు ఎన్ ఆర్ ఐల మద్దతు

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనతో విదేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు పెద్దఎత్తున మద్దతు పలుకుతున్నారు. ఇందులో భాగంగా విదేశాల్లో స్థిరపడిన సుమారు 40 మంది ఎన్‌ఆర్‌ఐలు బుధవారం రాత్రి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ మోహన్‌ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీలకు దీటుగా థర్డ్‌ ఫ్రంట్‌ను రూపొందించే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని తాము విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో టీఆర్‌ఎస్‌ ఉద్యమం సాగినప్పుడు తాము మద్దతు ఇచ్చామని, ప్రస్తుతం కూడా అదేవిధంగా మద్దతు ఇస్తామన్నారు.