నేడు మహిళల పండుగ

నేడు మహిళల పండుగ

08-03-2018

నేడు మహిళల పండుగ

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ప్రజలు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నారు. ఈ ఏడాదికి మహిళా దినోత్సవం ఇతివృత్తంగా ప్రెస్‌ ఫర్‌ ప్రొగ్రెస్‌ ( ప్రగతి కోసం పట్టుబట్టండి) నినాదాన్ని ఐక్యరాజ్య సమితి ఖారారు చేసింది. గత కొన్నేళ్లుగా స్త్రీలు అనేక రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా ఆడ-మగ తారతమ్యాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించి పురుషులతో సమానంగా హక్కులు సాధించే లక్ష్యంతో ఈ నినాదాన్ని ఎంపిక చేశారు. 1975లో ఐక్యరాజ్య సమితి మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అయితే దీనికి ఎన్నో ఏళ్ల ముందు నుంచి కూడా అనేక దేశాల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తొలిసారిగా అమెరికాలో 1909లో ఫిబ్రవరి 28ని మహిళా దినోత్సవంగా పాటించారు.