విమాన చార్జీలకు కళ్లెం?
Sailaja Reddy Alluddu

విమాన చార్జీలకు కళ్లెం?

07-03-2018

విమాన చార్జీలకు కళ్లెం?

 

పండుగ సీజన్‌, అత్యవసర సమయాల్లో చుక్కలనంటుతున్న విమాన చార్జీలపై ఆందోళన వ్యక్తం చేసిన పార్లమెంటరీ కమిటి, టిక్కెట్‌ ధరలకు కళ్లెం వేయాలని ప్రతిపాదించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న విమాన చార్జీల విధానం భారత మార్కెట్‌కు సరిపోదని కమిటీ అభిప్రాయపడింది. ఎయిర్‌లైన్‌ అపరేటర్ల ఆగడాల గురించి పౌర విమానయాన శాఖకు తెలిసినప్పటికీ టిక్కెట్‌ ధరల నియంత్రణ విషయంలో ఎలాంటి చొరవ తీసుకోవడం లేదని పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో కమిటీ పేర్కొంది. విమాన టిక్కెట్‌ ధరల నియంత్రణకు సంబధించి గతంలో తాము ప్రతిపాదించిన చర్యలను మంత్రిత్వ శాఖ పెద్దగా పట్టించుకున్నట్లు కన్పించడం లేదని రవాణా, పర్యాటక రంగాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ అభిప్రాయపడింది.