విభజన సమస్యలపై దద్దరిల్లిన ఢిల్లీ
MarinaSkies
Kizen
APEDB

విభజన సమస్యలపై దద్దరిల్లిన ఢిల్లీ

06-03-2018

విభజన సమస్యలపై దద్దరిల్లిన ఢిల్లీ

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం కోసం దేశ రాజధాని ఢిల్లీ దద్ధరిల్లింది. ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిపోయింది. విభజన హామీలు నెరవేర్చేవరకు పోరాటం ఆపేది లేదని తెలుగు ఎంపీలు కేంద్రానికి గట్టి హెచ్చరికలు పంపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు పెండింగ్‌లో ఉన్న విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు వరుసగా రెండోరోజు తమ పోరాటాన్ని కొనసాగించారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. విభజన హామీల అమలుపై కేంద్రం కాలయాపన చేస్తోందని విమర్శించారు. కేంద్రం న్యాయం చేసేవరకు పోరాటం కొనసాగుతుందని సృష్టం చేశారు. ఈ ఆందోళనలో గల్లా జయదేవ్‌, తోట నరసింహం, శివప్రసాద్‌, మురళీమోహన్‌, నిమ్మల కిష్టప్ప, రామ్మోహన్‌నాయుడు, మాగంటి బాబు తదితర ఎంపీలు పాల్గొన్నారు.