అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా : రాహుల్

అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా : రాహుల్

06-03-2018

అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా : రాహుల్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి  ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. పార్లమెంటు స్ట్రీట్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలో రాహుల్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన అంశంలో ఆంధ్రులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.