మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం

మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం

06-03-2018

మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం

మేఘాలయాలో బీజేపీ మిత్రపక్షమైన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) అధ్యక్షుడు కాన్రాడ్‌ సంగ్మా (40) రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ పీఏ సంగ్మా కుమారుడైన కాన్రాడ్‌ సంగ్మా మేఘాలయకు 12వ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఎన్‌పీపీ, బీజేపీ సహా నాలుగు పార్టీలు, ఓ స్వతంత్రుడితో కలిసి ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సంగ్మా ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు.