ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఏషియా

ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఏషియా

06-03-2018

ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఏషియా

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా మరో ఆఫర్‌ను ప్రకటించింది. అన్ని పన్నులు కలుపుకొని ఒకవైపు ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.799గా నిర్ణయించింది. ఈ నెల 11 లోపు బుకింగ్‌ చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రత్యేక ఆఫర్‌ వర్తించనున్నది. ఇలా బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు 3 సెప్టెంబర్‌ నుంచే వచ్చే ఏడాది మే 28 లోపు ప్రయాణించాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆఫర్‌ హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్‌కతా, గోవా, జైపూర్‌, పుణె, ఇంపాల్‌, వైజాగ్‌, శ్రీనగర్‌, రాంచి భువనేశ్వర్‌, చెన్నైల మధ్య తిరిగే విమానాలకు వర్తించనున్నది. అలాగే రూ.999కే అంతర్జాతీయ రూట్‌లో విమాన టికెట్టును అందిస్తున్నది.