వాయిదా పడిన ఉభయ సభలు

వాయిదా పడిన ఉభయ సభలు

05-03-2018

వాయిదా పడిన ఉభయ సభలు

పార్లమెంటు మలివిడత సమావేశాల్లో  టీడీపీ ఎంపీలు నిరసనలతో హోరెత్తించారు. విభజన హామీలపై సృష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపట్టికే వాయిదా పడ్డాయి. లోక్‌సభ మొదలైన వెంటనే టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలంటూ నినదించారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను వాయిదా వేశారు. అటు రాజ్యసభలో అదే పరిస్థితి నెలకొంది. ఏపీకి న్యాయం చేయాలంటూ టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. టీడీపీ ఎంపీల ఆందోళనకు టీఆర్‌ఎస్‌, టీఎంసీ మద్దతు తెలిపాయి. దీంతో సభలో గందరగోళం నెలకనొడంతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి మొదలైన సభలోనూ టీడీపీ ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు. చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభ్యులకు నచ్చజెప్పేందుకు యత్నించినప్పటికీ వారు వినకపోవడంతో సభను రెండోసారి వాయిదా వేశారు.