రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

05-03-2018

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు మార్చి 23న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 12 చివరి తేదీగా నిర్ణయించింది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన, మార్చి 15వ తేదీన నామినేషన్ల ఉపసంహరించుకోవడానికి అవకాశం కలిపించింది. ఈ నెల 23వ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది.