హాంకాంగ్ లో నీరవ్ మోడీ?
Sailaja Reddy Alluddu

హాంకాంగ్ లో నీరవ్ మోడీ?

05-03-2018

హాంకాంగ్ లో నీరవ్ మోడీ?

పంజాబ్‌  నేషనల్‌ బ్యాంక్‌ను రూ.12,600 కోట్లమేర మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోడీ హాంకాంగ్‌లో ఉన్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తెలిపింది. అయితే, నీరవ్‌ హాంకాంగ్‌లో తలదాచుకున్నాడన్న విషయాన్ని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టుకు సమర్పించిచన పత్రాల నుంచి తొలగించినట్టు ఈడీ తరపున న్యాయవాది హితేన్‌ వెనెగాంకర్‌ తెలిపారు. మరోవైపు హాంకాంగ్‌లో ఉన్నట్టు తమ దగ్గర సమాచారమున్నదని ఈడీలోని సీనియర్‌ అధికారి సృష్టం చేశారు. డబ్బు అక్రమ తరలింపు నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నీరవ్‌మోడీతో పాటు ఆయన మేనమామ మోహుల్‌ ఛోక్సీలకు ప్రత్యేక కోర్టు నాన్‌బెయిలెబుల్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.