చరిత్ర సృష్టించిన కృష్ణకుమారి

చరిత్ర సృష్టించిన కృష్ణకుమారి

05-03-2018

చరిత్ర సృష్టించిన కృష్ణకుమారి

ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్‌లో ఓ హిందూ దళిత మహిళ చరిత్ర సృష్టించారు. సింధ్‌ ప్రాంతానికి చెందిన కృష్ణకుమారి కోల్హి (39) సింధ్‌ ప్రావిన్స్‌కు సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ఈమె పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) సభ్యురాలు. దేశంలో మహిళల అభ్యున్నతి, మైనారిటీల హక్కుల సాధనకు కోల్హి గెలుపు ఓ మైలురాయి వంటిదని పీపీపీ పేర్కొంది. 52 మంది సెనేటర్ల పదవీ కాలం  ఈ నెలతో ముగిసిపోతుండటంతో ఈ ఎన్నికలు నిర్వహించారు. పీపీపీ ఇంతకుముందు రత్న భగవాస్‌ దాస్‌ చాల్లా అనే హిందూ మహిళను సెనేటర్‌గా నియమించింది.