వారికి పొడిగిస్తే ఏపీకి అడుగుతా

వారికి పొడిగిస్తే ఏపీకి అడుగుతా

03-03-2018

వారికి పొడిగిస్తే ఏపీకి అడుగుతా

ప్రత్యేకహెదా ఆ మూడు రాష్ట్రాలకు పొడిగిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేకహోదా ఇవ్వాలని నేనే కేంద్రాన్ని అడుగుతా అని ఆంధ్రప్రదేశ్‌ బీజీపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు సృష్టం చేశారు. ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకహోదాను మూడేళ్లపాటు పొడిగిస్తున్నారని కొందరు అంటున్నారని, అది నిజమైతే తాను కేంద్రాన్ని అడుగుతానన్నారు. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు నిధుల విడుదల విషయంలో ఎలాంటి వివక్ష చూపకూడదని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని, అలాంటప్పుడు ప్రత్యేకహోదావల్ల లాభమేంటని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో హరిబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఎప్పుడూ, ఏ కేంద్ర ప్రభుత్వమూ, ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయని తెలిపారు.