కంచి పీఠాధిపతిగా విజయేంద్ర సరస్వతి
MarinaSkies
Kizen
APEDB

కంచి పీఠాధిపతిగా విజయేంద్ర సరస్వతి

03-03-2018

కంచి పీఠాధిపతిగా విజయేంద్ర సరస్వతి

ప్రసిద్ద కంచి పీఠానికి 70 వ పీఠాధిపతిగా విజయేంద్ర సరస్వతి నియమితులయ్యారు. కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి నిర్యాణం నేపథ్యలో ఈ పీఠం సారథ్యాన్ని శ్రీ విజయేంద్ర సరస్వతికి కంచి మఠం అప్పగించింది. కంచి 69వ పీఠాధిపతిగా జయేంద్ర సరస్వతి రెండు రోజుల క్రితం శివైక్యమైన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కంచి 70 పీఠాధిపతిగా 48ఏళ్ల విజయేంద్ర సరస్వతిని నియమించినట్లు కంచి మఠం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వ ధర్మకరుృత్త్వ విభాగానికి సమాచారం ఇచ్చినట్టు అధికారికంగా పేర్కొంది.