హైదరాబాద్ లో మరో ప్రతిష్టాత్మక సంస్థ ప్రారంభం

హైదరాబాద్ లో మరో ప్రతిష్టాత్మక సంస్థ ప్రారంభం

01-03-2018

హైదరాబాద్ లో మరో ప్రతిష్టాత్మక సంస్థ ప్రారంభం

హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక సంస్థ రాష్ట్రంలో తమ ఉత్పత్తులను ప్రారంభించింది. వైమానికి రంగానికి చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ అండ్‌ బోయింగ్‌ జాయింట్‌ వెంచర్‌ ఆధ్వర్యంలో ఆదిభట్లలో ఏర్పాటైన టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ కంపెనీ నేడు ప్రారంభమైంది. టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ కంపెనీని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. వైమానిక సెజ్‌లో 13 ఎకరాల్లో రూ.200 కోట్లతో పరిశ్రమను నిర్మించారు. బోయింగ్‌ ఏహెచ్‌-64 విమానాల విడిభాగాలకు తోడు అపాచీ హెలికాఫ్టర్లను ఇందులో తయారు చేస్తున్నారు. వీటికి అమెరికా సహ ఆ 15 దేశాల్లో బాగా డిమాండ్‌ ఉంది.  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, టాటా సన్స్‌ ఎమరిటీస్‌ చైర్మన్‌ రతన్‌ టాటా, అమెరికా రాయబారి కెన్నత్‌ జెస్టర్‌, ఎంపీలు కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్‌, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.